పంట నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకోవాలి

ABN , First Publish Date - 2022-06-28T06:24:31+05:30 IST

గత ఏడాది ఖరీఫ్‌లో పంట నష్టపోయి న ప్రతి రైతుకూ పంటల బీమా పరిహారం అందజేయాలని సీపీఎం నాయకులు డిమాండ్‌ చేశారు.

పంట నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకోవాలి
పెనుకొండ ధర్నాలో మాట్లాడుతున్న ఓబులు

సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట రైతుల ధర్నా


పెనుకొండ, జూన 27: గత ఏడాది ఖరీఫ్‌లో పంట నష్టపోయి న ప్రతి రైతుకూ పంటల బీమా పరిహారం అందజేయాలని సీపీఎం నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం స్థానిక సబ్‌ కలెక్టర్‌ కా ర్యాలయం ఎదుట సీపీఎం అనుబంధ రైతు, వ్యవసాయ, కౌలు రై తు సంఘాలు, సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. పెనుకొం డ రెవెన్యూ డివిజనలోని 13 మండలాల నుంచి రైతులు తరలివ చ్చారు. అంతకుముందు రైతులు బ్యానర్లు, ప్లకార్డులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు ఓబులు, వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు పెద్దన్న,  రైతు సంఘం అధ్యక్షుడు హరి, కౌలు రైతు సంఘం అధ్యక్షులు సి ద్దారెడ్డి, రమేష్‌, బాబావలి, శ్రీనివాసులు మాట్లాడారు. ఇన్సూరెన్స రా ని రైతులందరికీ ఎకరాకు రూ.25వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని కోరారు.


 పెనుకొండ రెవెన్యూ డివిజనలోని 13 మండలాల్లో 1,42,454 మంది రైతుల ఖాతాలు ఉండగా, ఇందులో ఇన్సూరెన్స కేవలం 57,466 మందికి మాత్రమే వచ్చిందన్నారు. వీరిలో 50శాతం మంది రైతులకు ఇంకా డబ్బు బ్యాంకులో జమకాలేదన్నారు. రెవె న్యూ డివిజనలో 60శాతం మంది రైతులకు నయాపైసా కూడా ఇ న్సూరెన్స రాక తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. మడకశిర, పెనుకొం డ, గుడిబండ, హిందూపురం, సోమందేపల్లి, రొద్దం, రొళ్ల, చిలమత్తూరు, పరిగి, అమరాపురం గోరంట్ల మండలాల్లో రైతులకు వేరుశనగ పంట బీమా వర్తింపజేయలేదన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల అర్హులైన రైతులు తీవ్రంగా నషపోయారన్నారు. అనంతరం సబ్‌ క లెక్టర్‌ నవీనకు వినతిపత్రం అందజేశారు.  


అర్హులకు బీమా అందేవరకు పోరాడుతాం..

మడకశిర రూరల్‌: అర్హులైన రైతులకు పంటల బీమా అందేవరకు పోరాటం చేస్తామని టీడీపీ మాజీ ఎంపీటీసీ నాగభూషణ్‌ రెడ్డి తెలిపారు. సోమవారం మండలంలోని ఆమిదాలగొంది పంచాయతీ రైతులతో కలసి గ్రామ సచివాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ పంటల బీమా మంజూరులో రైతుల కు అన్యాయం జరిగిందన్నారు. అర్హులైన రైతులకు న్యాయం జరిగే వరకు టీడీపీ పోరాటం చేస్తుందన్నారు. అనంతరం గ్రామ కార్యదర్శి మురళీకృష్ణకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ నా యకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.


నేడు పంటల బీమాపై టీడీపీ నిరసన 

గోరంట్ల: పంటల బీమా రాని రైతులకు అండగా నిలుస్తూ తెలుగుదేశం పార్టీ మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మండల పార్టీ కన్వీనర్‌ సోమశేఖర్‌ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి ఆధ్వర్యంలో ఉద యం 10 గంటలకు నిరసన చేపడతామన్నారు. బస్టాండు కూడలిలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వర కు ర్యాలీగా వెళ్లి వినతిపత్రం అందజేస్తామన్నారు. మండలంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, రైతులు అధిక సం ఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 


Updated Date - 2022-06-28T06:24:31+05:30 IST