ప్రతి ఆరుగురు నిరుపేదల్లో ఐదుగురు కింది కులాల నుంచే..

ABN , First Publish Date - 2021-10-08T07:08:17+05:30 IST

భారత్‌లో సగటున ప్రతి ఆరుగురు నిరుపేదల్లో ఐదుగురు ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ కులాల నుంచే ఉన్నారు. వీరిలోనూ ఎస్టీల్లో అందరికంటే..

ప్రతి ఆరుగురు నిరుపేదల్లో ఐదుగురు కింది కులాల నుంచే..

యునైటెడ్‌ నేషన్స్‌, అక్టోబరు 7: భారత్‌లో సగటున ప్రతి ఆరుగురు నిరుపేదల్లో ఐదుగురు ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ కులాల నుంచే ఉన్నారు. వీరిలోనూ ఎస్టీల్లో అందరికంటే ఎక్కువగా నిరుపేదలున్నారు. ఆ తర్వాత ఎస్సీలు, ఓబీసీల్లో ఎక్కువగా ఉన్నారు. ఐక్యరాజ్య సమితి, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నిపుణులు రూపొందించిన ‘మల్టీడైమెన్షనల్‌ పావర్టీ ఇండెక్స్‌’ నివేదిక ఈ విషయాలను వెల్లడించింది. విద్య, ఆరోగ్యం, జీవన ప్రమాణాలు, భద్రత తదితర అంశాల్లో వెనుకబడినవారిని నిరుపేదలుగా నివేదిక పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే నిరుపేదలు ఎక్కువగా భారత్‌లోనే (38.1 కోట్లు) ఉన్నారు. ఎస్టీల్లో 6.5 కోట్ల మంది, ఎస్సీల్లో 9.4 కోట్ల మంది, ఓబీసీల్లో 16 కోట్ల మంది నిరుపేదలుగా ఉన్నట్టు ఐరాస నివేదిక పేర్కొంది. 

Updated Date - 2021-10-08T07:08:17+05:30 IST