Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎవర్‌గ్రాండ్... ‘డిఫాల్టర్‌’ ?

ముంబై : చైనా ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం మందగమనంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లోనే... మరో భారీ పతనం చైనాను కోలుకోలేని దెబ్బతీసింది. అంతర్జాతీయ నిర్మాణ సంస్థ ‘ఎవర్‌గ్రాండ్’పై  ‘డిఫాల్టర్‌’ ముద్ర పడే పరిస్థితి కనిపిస్తోంది. ఎవర్‌గ్రాండ్ షేర్లు భారీగా పతనమయ్యాయి. ఈ రోజు(గురువారం) ఉదయం హాంకాంగ్‌ స్టాక్‌ ఎక్సేంజిలో... ఎవర్‌గ్రాండ్ పధ్నాలుగు శాతం పతనాన్ని చూడాల్సివచ్చింది. ఇప్పటికే ఆర్ధికసంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఎవర్‌గ్రాండ్‌.. తన యూనిట్లలో ఒకదానిని 2.6 బిలియన్‌ డాలర్లకు విక్రయించాలన్న ప్రతిపాదనతోపాటు అందుకు సంబంధించిన యత్నాలు విఫలమైన విషయం తెలిసిందే.


ఈ క్రమంలోనే... ఎవర్‌గ్రాండ్ షేర్లు ఒక్కసారిగా పతనమవుతున్నాయి. ఈ నేపధ్యంలో...  గృహనిర్మాణ రంగం మందగించింది. తత్ఫలితంగా... ప్రపంచవ్యాప్తంగా మెటల్‌ షేర్లకు డిమాండ్‌ తగ్గవచ్చన్న వ్యాఖ్యానాలు వినవస్తున్నాయి. ఎవర్‌గ్రాండ్ ప్రాపర్టీస్‌ సర్వీసెస్‌లో సింహభాగాన్ని( 51 శాతం)  హోప్‌సన్‌ డెవలప్‌మెంట్‌ హోల్డింగ్స్‌కు విక్రయించే ప్రతిపాదనను ఉపసంహరించుకోనున్నట్లు నిన్న(బుధవారం) ఓ అధికారిక ప్రకటన వెలువడిన విషయం తెలిసిందే. కాగా... హోప్‌సన్‌ డెవలప్‌మెంట్‌ మాత్రం... ఎవర్‌గ్రాండ్‌ విధించిన షరతుల నేపధ్యంలోనే సంబంధిత ప్రక్రియనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది.

Advertisement
Advertisement