ఏయూలో కారుణ్య నియామకాలు ఎన్నడో?

ABN , First Publish Date - 2022-06-30T05:53:29+05:30 IST

‘కొవిడ్‌, ఇతర కారణాలతో చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు కారుణ్య నియామకాలు కింద వీలైనంత వేగంగా ఉద్యోగాలివ్వండి. ఇంటి పెద్దను కో ల్పోయిన కుటుంబసభ్యులు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఒకరికి ఉద్యోగావకాశాన్ని కల్పించి అండగా నిలవాలి’ కొద్ది నెలల కిందట కారుణ్య నియామకాలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం జగన్మోహ న్‌రెడ్డి వ్యాఖ్యలివి. ముఖ్యమంత్రి ఆదేశాలివ్వడంతో ఆంధ్ర యూనివ ర్సిటీలో పనిచేసి మృతిచెందిన పలువురు ఉద్యోగులు కుటుంబసభ్యులు ఉద్యోగాలు వస్తాయని ఆశించారు. నెలలు దాటుతున్నా ప్రక్రియ ప్రారంభం కాకపోవడం తో వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్‌తో పాటు ఇతర కారణాలతో చనిపోయిన వర్సిటీ ఉద్యో గులు సుమారు వంద మంది ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ ఉద్యోగాలకు వారి కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో సుమారు 80 మం దిని అర్హులుగా గుర్తించారు. ఏడాది కిందట నియమించిన కమిటీ సమావేశాన్ని నిర్వహించింది. ఒక వ్యక్తికి ఉద్యోగం ఇచ్చేలా కుటుంబసభ్యుల నుంచి సమ్మతి పత్రాన్ని తీసుకుంది. ఈ నెలాఖరులోగా ప్రక్రి య ముగించి, నియామక ఉత్తర్వులు అందించాలి. కానీ ఇప్పటివరకు ఆ దిశగా చర్యలు కనిపించలేదు.

ఏయూలో కారుణ్య నియామకాలు ఎన్నడో?

 ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న కుటుంబసభ్యులు

 80 మంది అర్హులుగా గుర్తింపు

 ఈ నెలాఖరుకి  ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశం  

 ఇప్పటికీ కొలిక్కి రాని  పోస్టుల భర్తీ   

(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి) 

‘కొవిడ్‌, ఇతర కారణాలతో చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు కారుణ్య నియామకాలు కింద  వీలైనంత వేగంగా ఉద్యోగాలివ్వండి. ఇంటి పెద్దను కో ల్పోయిన కుటుంబసభ్యులు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఒకరికి ఉద్యోగావకాశాన్ని కల్పించి అండగా నిలవాలి’ కొద్ది నెలల కిందట కారుణ్య నియామకాలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం జగన్మోహ న్‌రెడ్డి వ్యాఖ్యలివి. 

ముఖ్యమంత్రి ఆదేశాలివ్వడంతో ఆంధ్ర యూనివ ర్సిటీలో పనిచేసి మృతిచెందిన పలువురు ఉద్యోగులు కుటుంబసభ్యులు ఉద్యోగాలు వస్తాయని ఆశించారు.  నెలలు దాటుతున్నా ప్రక్రియ ప్రారంభం కాకపోవడం తో వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్‌తో పాటు ఇతర కారణాలతో చనిపోయిన వర్సిటీ ఉద్యో గులు సుమారు వంద మంది ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ ఉద్యోగాలకు వారి కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో సుమారు 80 మం దిని అర్హులుగా గుర్తించారు. ఏడాది కిందట నియమించిన కమిటీ సమావేశాన్ని నిర్వహించింది. ఒక వ్యక్తికి ఉద్యోగం ఇచ్చేలా కుటుంబసభ్యుల నుంచి సమ్మతి పత్రాన్ని తీసుకుంది. ఈ నెలాఖరులోగా ప్రక్రి య ముగించి, నియామక ఉత్తర్వులు అందించాలి. కానీ ఇప్పటివరకు ఆ దిశగా చర్యలు కనిపించలేదు. 

ఆర్థిక ఇబ్బందుల్లో కుటుంబాలు 

రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వశాఖల్లో కారుణ్య నియామకాల ప్రక్రియను పూర్తిచేశారు. ఒకటి రెండు శాఖల్లో మాత్రమే పెండింగ్‌ ఉంది. ఏయూలో మా త్రం మూడేళ్ల కిందట చేపట్టిన నియామకాలే చివరివి.  అప్పటి వైస్‌ చాన్సలర్‌ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ నియామకాలు చేపట్టారు. ఆ తరువాత నుంచి కారు ణ్య నియామకాల జోలికి వర్సిటీ అధికారులు పోలేదు. కరోనా సమయంలో ఎక్కువమంది ఉద్యోగులు ప్రాణా లు కోల్పోయారు. వారి కుటుంబ సభ్యుల ఆర్థిక ఇబ్బం దులను దృష్టిలో పెట్టుకుని వీలైనంత వేగంగా ప్రక్రి య పూర్తిచేసి, ఉద్యోగుల కుటుంబాల్లో వెలుగులు నింపాలని కోరుతున్నారు. 


న్యాయ పరమైన చిక్కులతోనే జాప్యం

కారుణ్య నియామకాలను వేగంగా పూర్తిచేసే ఉద్దేశంతో ప్రక్రియ ప్రారంభించాం. కొంతమంది ఉద్యోగాల భర్తీకి న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి.  కమిటీసభ్యులు తీసుకున్న పలు నిర్ణయాలను ప్రభుత్వానికి నివేదించారు. పూర్తిగా పరిశీలించి నియామక ప్రక్రియను చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. మృతి చెందిన ఉద్యోగి కుటుంబస భ్యులకు అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతో కొంత సమయం తీసుకుంటున్నాం. 

- ప్రొఫెసర్‌ కృష్ణమోహన్‌, ఏయూ రిజిస్ర్టార్‌

Updated Date - 2022-06-30T05:53:29+05:30 IST