కరోనా కల్లోలం: ఆందోళన కలిగిస్తున్న జపాన్ ప్రజల తీరు...

ABN , First Publish Date - 2020-04-04T23:23:46+05:30 IST

కరోనా మహమ్మారి జపాన్‌లో తిష్టవేసే ప్రజలను వేధించేందుకు సిద్ధంగా ఉంది. ప్రభుత్వానికి, ప్రజలకు కూడా ఈ విషయం తెలుసు. దీంతో.. ప్రజలు ఇంటి నుంచే ఆఫీసు పనులు చక్కబెట్టుకోవాలంటూ టోక్యో గవర్నర్ ఇటీవల పిలుపునిచ్చారు. అయితే జపాన్‌లో ప్రస్తుతతం ఎటువంటి లాక్ డౌన్ అమల్లో లేదు. మరోవైపు.. జపాన్ ప్రధాని షింజో అబే ఆరోగ్య ఎమర్జెన్సీ విధించే అవకాశం లేదని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే జపనీయులు ఇప్పటికీ ఆఫీసులకు వెళుతున్నారు.

కరోనా కల్లోలం: ఆందోళన కలిగిస్తున్న జపాన్ ప్రజల తీరు...

టోక్యో: కరోనా మహమ్మారి జపాన్‌లో తిష్టవేసి ప్రజలను వేధించేందుకు సిద్ధంగా ఉంది. ప్రభుత్వానికి, ప్రజలకు కూడా ఈ విషయం తెలుసు. దీంతో.. ప్రజలు ఇంటి నుంచే ఆఫీసు పనులు చక్కబెట్టుకోవాలంటూ టోక్యో గవర్నర్ ఇటీవల పిలుపునిచ్చారు. అయితే జపాన్‌లో ప్రస్తుతం ఎటువంటి లాక్ డౌన్ అమల్లో లేదు. మరోవైపు.. జపాన్ ప్రధాని షింజో అబే ఆరోగ్య ఎమర్జెన్సీ విధించే అవకాశం లేదని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే జపనీయులు ఇప్పటికీ ఆఫీసులకు వెళుతున్నారు. ఉదయం సాయత్రం వేళల్లో అక్కడి ట్రైన్లు, ఇతర ప్రజా రవాణా సదుపాయాలు కిక్కిరిసిపోతున్నాయి.


ఈ వైఖరే ప్రస్తుతం ఆందోళనకి దారితీస్తోంది. వాస్తవానికి జపాన్ ప్రజలకు పనే సర్వస్వం. నిరంతరం పనిపైనే ధ్యాస పెట్టడం వల్ల కొందరు జపనీయుల్లో ఒత్తడి పెరిగి మరణానికి దారితీస్తోంది. ఈ పరిస్థితిని జపానీస్ భాష‌లో కరోషి అంటారు. జపనీయుల సంస్కృతి సాంప్రదాయాలలో పనికి ఉన్న ప్రాధాన్యం మరి దేనికీ ఉండాదు.దీంతో వారు వృత్తిని ఎటువంటి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయలేరు. ఇదిలా ఉంటే.. జాపాన్‌లో 80 శాతం కంపెనీలు ఉద్యోగులను ఇంటి పనిచేయించే స్థితిలోలేవని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి.


హోండా, టొయోగా నిస్సాన్ లాంటి కంపెనీలు వర్క్ ఫ్రం హోం చేయాలని ఉద్యోగులకు సూచించినప్పటికీ తరతరాలు వస్తున్న ఆలోచనా ధోరణి కారణంగా అనేక మంది ఉద్యోగులు ఇప్పటికీ ఆఫీసులకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి కోసం ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని నిఫుణులు సూచిస్తున్నారు. అత్యవసర సేవలు మినహా అన్ని వ్యాపారాలను మసేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తే తప్ప ప్రజలను ఇళ్లకు పరిమితం చేయలేమని వారు అభిప్రాయపడుతున్నారు. ‘జపాన్ ప్రజలు తమ పనికి బానిసలు, ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటే తప్ప వారు ఇళ్లలో ఉండాలను కోరు’ అంటూ ఓ స్థానికుడు చేసిన వ్యాఖ్యలు అక్కడి పరిస్థితి అద్దం పడుతున్నాయి. 

Updated Date - 2020-04-04T23:23:46+05:30 IST