అన్నీ ఉన్నా.. ప్రయోజనమేదీ?

ABN , First Publish Date - 2022-10-03T04:52:00+05:30 IST

మండలంలోని సీహెచ్‌పీలో పేదప్రజలకు వైద్యం అందని ద్రాక్షలాగే మారిందని ప్రజలు పేర్కొంటున్నారు. అత్యంత మారుమూల మండలమైన తిర్యాణి చుట్టు పక్కల అనేక గిరిజన గ్రామాలు ఈ వైద్యశాలకే వైద్యంకోసం వస్తుంటారు.

అన్నీ ఉన్నా.. ప్రయోజనమేదీ?
తిర్యాణిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం

- పేదలకు అందని ద్రాక్షలా మిగిలిన వైద్యం

- లక్షలు వెచ్చించి మూలనపడేసిన ఆధునిక వైద్య పరికరాలు

తిర్యాణి, అక్టోబరు 2: మండలంలోని సీహెచ్‌పీలో పేదప్రజలకు వైద్యం అందని ద్రాక్షలాగే మారిందని ప్రజలు పేర్కొంటున్నారు. అత్యంత మారుమూల మండలమైన తిర్యాణి చుట్టు పక్కల అనేక గిరిజన గ్రామాలు ఈ వైద్యశాలకే వైద్యంకోసం వస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో పేదలకు ప్రభుత్వ వైద్యశాలలో మెరుగైన వైద్యం అందించాలన్న ఉద్ధేశ్యంతో అత్యంత ఖరీదైన వైద్య పరీక్షలకు సంబంధించిన పరికరాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. అయితేవాటిని ఉప యోగించకుండా ఓ మూలనపడేశారు. దీంతో అంగ ట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా పరిస్థితి తయారైందని గిరిజనులు వాపోతున్నారు. ఎక్స్‌రే, ఈసీజీ, సీబీపీ లాంటి అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నప్పటికీ వాటికి సంబంధించి పరీక్షలు నిర్వహించే సిబ్బంది లేదు. దీంతో మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల, కరీంనగర్‌ ప్రాంతా లకు వెళ్తున్నామని ఆదివాసీ గిరిజనులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్స్‌రే, ఈసీజీ, సీబీపీ పరీ క్షలు చేయించుకోవాలంటే రూ.500 పైగా నే అవుతాయి. వాటికితోడు రవాణా ఖర్చు లు పెరగడంతో వైద్యం కోసం గిరిజనులు బయటికి వెళ్లే పరిస్థితి లేక కొన్ని సార్లు ప్రాణాల మీదికి వస్తుందని వారు వాపోతున్నారు. వైద్యశాలలో స్పెషలిస్టు వైద్యులను, పరికరాలను వెంటనే గిరిజనులకు అందుబాటులోకి తెచ్చే విధంగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఆదివాసులు డిమాండ్‌ చేస్తున్నారు. 

పరికరాలను ఉపయోగంలోకి తీసుకురావాలి

- వెడ్మ భగవంతరావు, తుడుందెబ్బ డివిజన్‌ అధ్యక్షుడు

ఆస్పత్రిలో ఆధు నిక పరికరాలు ఉన్నప్పటికీ వాటికి సంబంధిం చిన టెక్నీషియన్‌ లేక పోవడంతో గిరిజ నులకు సరైన వైద్యం అందడం లేదు. దీంతో గిరిజనులు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకుని వేల రూపాయలు నష్టపోతున్నారు. వెంటనే పరికరాలను అందుబాటులోకి తీసుకువచ్చి మెరుగైన వైద్యసేవలు అందించాలి.

Updated Date - 2022-10-03T04:52:00+05:30 IST