స్వాతంత్య్రం వచ్చినా అవకాశాలు దక్కలేదు

ABN , First Publish Date - 2022-07-04T04:48:50+05:30 IST

స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గ డిచినా దేశంలో బీసీలకు ఇంకా సమాన అవకాశాలు దక్కలేద ని రాష్ట్ర బీసీ కమిషన్‌ సభ్యులు జస్టిస్‌ ఎం క్రిష్ణప్ప అభిప్రాయ పడ్డారు.

స్వాతంత్య్రం వచ్చినా అవకాశాలు దక్కలేదు
సమావేశంలో మాట్లాడుతున్న బీసీ కమిషన్‌ సభ్యులు, విశ్రాంత జిల్లా జడ్జి క్రిష్ణప్ప

రాష్ట్ర బీసీ కమిషన్‌ సభ్యులు జస్టిస్‌ క్రిష్ణప్ప

ప్రొద్దుటూరు అర్బన్‌ జూలై 3: స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గ డిచినా దేశంలో బీసీలకు ఇంకా సమాన అవకాశాలు దక్కలేద ని రాష్ట్ర బీసీ కమిషన్‌ సభ్యులు జస్టిస్‌ ఎం క్రిష్ణప్ప అభిప్రాయ పడ్డారు. ఆదివారం స్థానిక పద్మశాలీ కల్యాణ మండపంలో బీసీ ప్రజా చైతన్య సమాఖ్య ఆధ్వర్యంలో ప్రతిభకు పట్టాభిషేకం పేర బీసీ విద్యార్థులకు ప్రఙ్జ పురస్కార ప్రధానోత్సవ సభలో ఆయన మాట్లాడు తూ దేశ జనాభాలో 56 శాతానికి పైగావున్న బీసీలకు కేవలం 25 శాతం రిజర్వేషన్‌ అనేది ఏ ప్రాతిపదికన సబబుకాదన్నారు. 139 కులాలున్న బీసీలకు 1970లో అనంతరామ కమిషన్‌ వచ్చేవరకు రాష్ట్ర స్థాయిలో బీసీలకు రిజర్వేషన్లు లేవన్నారు. 1991లో వీపీ సింగ్‌ మండల్‌ కమిషన్‌ సిపారసులను పార్లమెంటులో ఆమోదించే వరకు కేంద్రంలో బీసీలకు రిజర్వేషన్లులేవన్నారు. 

 సుప్రీం కోర్టు 50 శాతం రిజర్వేషన్‌ మించకూడదనే గీతవల్ల బీసీలు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. చట్టసభల్లో బీసీలు రిజర్వేషన్‌ సాధించుకున్పప్పుడే రాజ్యాధికార లక్ష్యం నెరవేరుతుందన్నారు. రాజ్యాంగాన్ని సవరించాలంటే బీసీలను ఎంపీలను చేసి పార్లమెంటుకు పంపాలన్నారు. అనంతరం విద్యార్థులకు నగదు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో బీసీ ప్రజా చైతన్య సమాఖ్య అధ్యక్షుడు బొర్రా రామాంజనేయులు, జిల్లా అధ్యక్షుడు లింగమూర్తి పుట్టపర్తి సాహీతీ పీఠం అధ్యక్షుడు జింకా సుబ్రహ్మణ్యం బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు చంద్రమౌళి, పద్మశాలీయ సంఘం నేత అవ్వారు తాండవ క్రిష్ణ, బీసీ ప్రజాచైతన్య సమాఖ్య నేతలు ప్రధాన కార్యదర్శి జింకా మార్కెండేయులు కోశాధికారి సంటెన్న, వేల్పుల భాస్కర్‌, కొత్రపల్లి శ్రీను, జయరాం యాదవ్‌, మాజీ కౌన్సిలర్‌ తాటి శ్రీనివాసులు యాదవ్‌, భాస్కరరావు, రెడ్డి మారుతీ ప్రసాద్‌, జీసీ పుల్ల య్య, దస్తగిరి, రవీరంద్రరాజు, బత్తల శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-04T04:48:50+05:30 IST