టిక్కెట్లు బుక్ చేసుకుని కూడా...

ABN , First Publish Date - 2020-07-12T23:43:23+05:30 IST

కరోనా ప్రభావం శ్రీవారి భక్తులపైనా పడుతోంది. కరోనా కారణంగా భక్తులకు... స్వామి దర్శనాల సౌకర్యాన్ని చాలా వరకూ కుదించిన విషయం తెలిసిందే. ప్రతిరోజూ పరిమిత సంఖ్యలోనే ‘ఆన్‌లైన్‌’లో దర్శనం టికెట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే... ఆన్‌లైన్‌లో దర్శనం టికెట్లు బుక్ చేసుకుని కూడా... దర్శనానికి డుమ్మా కొట్టేస్తున్నారు భక్తులు. ఇటువంటి వారి సంఖ్య చెప్పుకోదగినంతగానే ఉంటోంది.

టిక్కెట్లు బుక్ చేసుకుని కూడా...

తిరుమల : కరోనా ప్రభావం శ్రీవారి భక్తులపైనా పడుతోంది. కరోనా కారణంగా భక్తులకు... స్వామి దర్శనాల సౌకర్యాన్ని చాలా వరకూ కుదించిన విషయం తెలిసిందే.  ప్రతిరోజూ పరిమిత సంఖ్యలోనే ‘ఆన్‌లైన్‌’లో దర్శనం టికెట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే... ఆన్‌లైన్‌లో దర్శనం టికెట్లు బుక్ చేసుకుని కూడా... దర్శనానికి డుమ్మా కొట్టేస్తున్నారు భక్తులు. ఇటువంటి వారి సంఖ్య చెప్పుకోదగినంతగానే ఉంటోంది. 


పోటీలు పడి మరీ టికెట్లు దక్కించుకున్నా కూడా... పలువురు భక్తులు... తిరుమల యాత్ర రద్దుకే మొగ్గు చూపున్నారు. కరోనా కేసులు పెరుగుతుండటం, కంటెయిన్‌మెంట్‌ జోన్లు విస్తృతమవడం ఇందుకు కారణాలుగా భావిస్తున్నారు.  


తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా తొమ్మిది వేల మంది, సర్వదర్శనం ద్వారా మూడు వేల మందికి... టికెట్లను అందుబాటులో ఉంచుతోంది టీటీడీ. శ్రీవారి ట్రస్టుకు విరాళాలనందించిన భక్తులు, ప్రముఖులతో కలిపి రోజుకు పదమూడు వేల మందికి పైగా భక్తులు... శ్రీవారి దర్శనానికి వచ్చేవారు. ఈ నెల 10 వ తేదీన 12 వేల టికెట్లు జారీ చేయగా... కేవలం 8,115 మంది మాత్రమే శ్రీవారి దర్శనం చేసుకోవడం గమనార్హం. అయితే... త్వరలోనే పరిస్థితులు మారతాయని అధికారులు చెబుతున్నారు. 




Updated Date - 2020-07-12T23:43:23+05:30 IST