Even dogs wonot eat this: కుక్కలు కూడా ఈ ఫుడ్ తినవు...పోలీసు మెస్ ఫుడ్‌పై యూపీ పోలీసు సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-08-11T15:51:52+05:30 IST

పోలీసు మెస్‌లో నాణ్యత లేని ఆహారం పెడుతున్నారని సాక్షాత్తూ ఓ పోలీసు కానిస్టేబుల్ రోదించిన ఉదంతం...

Even dogs wonot eat this: కుక్కలు కూడా ఈ ఫుడ్ తినవు...పోలీసు మెస్ ఫుడ్‌పై యూపీ పోలీసు సంచలన వ్యాఖ్యలు

ఫిరోజాబాద్(ఉత్తరప్రదేశ్): పోలీసు మెస్‌లో నాణ్యత లేని ఆహారం(substandard food) పెడుతున్నారని సాక్షాత్తూ ఓ పోలీసు కానిస్టేబుల్(Uttar Pradesh Police constable) రోదించిన ఉదంతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫిరోజాబాద్(Firozabad) నగరంలో వెలుగుచూసింది. ఫిరోజాబాద్ పోలీసు లైన్స్‌లోని మెస్‌లో నీళ్ల పప్పు, సరిగా ఉడకని రోటీలు పెట్టారని యూపీ పోలీసు కానిస్టేబుల్ మనోజ్ కుమార్(constable Manoj Kumar ) కన్నీళ్లతో( UP cop weeps) చెప్పారు. పోలీసు మెస్ లో నాణ్యత లేని ఆహారం పెడుతున్నారని తాను పలుసార్లు సీనియర్ ఎస్పీతోపాటు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని మనోజ్ కుమార్ ఆవేదనగా చెప్పారు. పోలీసు మెస్‌లో వడ్డించిన నాణ్యత లేని ఆహారాన్ని కానిస్టేబుల్ ప్లేటులో తీసుకొని ప్రజల ముందు బహిరంగంగా చూపిస్తూ విలపించారు.


మా పోలీసులు 12 గంటల పాటు డ్యూటీ చేసిన తర్వాత పెట్టే నాణ్యత లేని ఆహారాన్ని ప్లేటులో చూపిస్తూ కానిస్టేబుల్ మనోజ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.‘‘ఈ ఆహారాన్ని కుక్కలు కూడా తినవు,(Even a dogs wonot eat this) మా కడుపు నిండకుండా మేమెలా విధులు నిర్వర్తించాలి’’అని కానిస్టేబుల్ ప్రశ్నించారు. తమకు పౌష్టికాహారాన్ని అందించేందుకు వీలుగా తమకు ఇచ్చే అలవెన్సును పెంచుతామని సీఎం యోగి ఆదిత్యనాథ్ హామీ ఇచ్చినా ఇంకా తమకు నాణ్యత లేని ఆహారాన్నే పెడుతున్నారని కానిస్టేబుల్ విలపించారు.సీనియర్ ఎస్పీ, డీసీపీలు అవితినీతికి పాల్పడుతూ తమకు మాత్రం నాణ్యత లేని ఆహారం పెడుతున్నారని కానిస్టేబుల్ ఆరోపించారు.


 నాణ్యత లేని ఆహారాన్ని ప్లేటులో చూపిస్తూ తీసిన వీడియోను కానిస్టేబుల్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.అలీఘడ్ నగరానికి చెందిన మనోజ్ ఉద్యోగరీత్యా ఫిరోజాబాద్ పోలీసు లైన్స్ లో ఉంటూ మెస్ లో తింటున్నారు. పోలీసు ఉన్నతాధికారి మాకు పెట్టే భోజనం తింటారా? కనీసం వారి పిల్లలకు ఇలాంటి ఆహారం పెడతారా అని కానిస్టేబుల్ ప్రశ్నించారు.కానిస్టేబుల్ సోషల్ మీడియాలో పెట్టిన ఈ వీడియో వైరల్ అయింది.


Updated Date - 2022-08-11T15:51:52+05:30 IST