Evelyn sharma ‘సాహో’ సినిమాలో నటించిన ఎవలిన్ శర్మ త్వరలో బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఈ ఏడాది మే 15న ఆమె ఆస్ట్రేలియన్ సర్జన్ తుషాన్ భిండీని వివాహం చేసుకున్నారు. పెళ్లి తంతు అంతా ఆస్ట్రేలియన్ సంప్రదాయంలో జరిగింది. అయితే ఈ పెళ్లి రహస్యంగా జరిగింది. ఈ జంట త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. జూలై 12న ఎవలిన్ శర్మ పుట్టిన రోజు. ఈ సందర్భంగా తాను తల్లిని కావడమే బెస్ట్ గిఫ్ట్ అని ఆమె తెలిపారు, తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇప్పుడు తామెంతో ఆనందంగా ఉన్నామని, తన పుట్టినరోజునాడు మంచి గిఫ్ట్ అందుతున్నదని పేర్కొన్నారు. తాము భావిజీవితాన్ని ఆనందమయం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తాను ఆస్ట్రేలియాలోనే డెలివరీ చేయించుకుంటానన్నారు. కాగా 34 ఏళ్ల ఎవలిన్ గతంలో తన భర్త తుషార్‌తో ఉన్న ఒక ఫొటోను షేర్ చేసి తమ వివాహం గురించి తెలియజేశారు.