ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుపై ఆవిరవుతున్న ఆశలు

ABN , First Publish Date - 2021-03-07T05:53:58+05:30 IST

రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా పేరొందిన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ప్రాణహిత సుజల స్రవంతి ప్రాజెక్టునిర్మాణం నిలిచి పోవడంతో ఇక్కడి ప్రజల ఆశలు ఆవిరయ్యాయి.

ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుపై ఆవిరవుతున్న ఆశలు
ప్రాజెక్టు కోసం రైతు పొలాల్లో తవ్విన అతి పెద్ద కాల్వలు

- కాల్వలు తవ్వారు.. వదిలేశారు..

- ఏళ్లు గడుస్తున్నా పట్టింపే లేని వైనం

- భూములను వదిలేసుకున్న రైతులు 

- కాగితాలకే పరిమితమైన ప్రాణహిత  చేవేళ్ల ప్రాజెక్టు పురోగతి 

కాగజ్‌నగర్‌, మార్చి 6: రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా పేరొందిన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ప్రాణహిత సుజల స్రవంతి ప్రాజెక్టునిర్మాణం నిలిచి పోవడంతో ఇక్కడి ప్రజల ఆశలు ఆవిరయ్యాయి. కొమురంభీం జిల్లా కౌటాల మండలం తుమ్మిడి హెట్టి వద్ద పెన్‌గంగ, వెన్‌గంగా రెండు పాయలుగా సంగమమయ్యే ప్రాంతాన్ని ప్రాణహితగా పిలు స్తారు. ఇక్కడే రూ.38,500 కోట్ల వ్యయంతో భారీ ప్రాజెక్టును చేపట్టేందుకు 2008లో అప్పటిరాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో డిజైన్‌ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాతో పాటు కౌటాల మండలం తుమ్డిహేట్టి నుంచి చేవెళ్ల వరకు 160.40లక్షల ఎకరాల సాగుకు నీరందించే లక్ష్యంతో 2009లో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి పనులకు భూమిపూజ చేపట్టారు. 160టీఎంసీ నీటిని వినియో గించుకునే లక్ష్యంతో చేపట్టారు. ఈ ప్రాజెక్టు పనుల కు టెండరు పొందిన కాంట్రాక్టర్లు మోబైల్‌ అడ్వా న్సు రూ.5వేల కోట్ల నిధులను తీసుకొని కాల్వలను కూడా తవ్వారు. తుమ్డిహేట్టి పరిసరాల ప్రాంతాల్లో ముంపునకు పోయే గ్రామాలకు పరిహారం అంద జేశారు. అనంతరం కాల్వలను శరవేగంగా తవ్వా రు. తర్వాత కొన్ని సాంకేతిక సమస్యలు ఏర్పడ టంతో ప్రాజెక్టు పనులు పురోగతి లేకుండా పోయింది. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మా ణం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది. 152 మీటర్ల ఎత్తున బ్యారేజీ నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో సమస్య మొదలైంది. ఉమ్మడి ఆదిలా బాద్‌ జిల్లాల్లో 1.56లక్షల ఎకరాల సాగుకు, కరీం నగర్‌కు రూ.1.71లక్షలు, నిజమాబాద్‌ రూ.3 లక్షలు, మెదక్‌కు రూ.5.19లక్షలు, నల్గొండకు రూ.2.29 లక్షలు, రంగారెడ్డికి రూ.2.46లక్షలు, వరం గల్‌కు 11వేలు కలుపుకొంటే మొత్తం 16.40లక్షల ఎకరాల సాగులోకి తెచ్చే చక్కటి ఆశయంతో ప్రారంభిం చారు. బడ్జెట్‌లో నిఽఽధుల కేటాయింపు కూడా దశల వారీగా చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్ప డటంతో ఈ ప్రాజెక్టు ఇక్కడ నిర్మించడం సరికాదని కౌటాల తుమ్డిహేట్టి నుంచి మేడిగడ్డ వద్ద కాళేశ్వ రం ప్రాజెక్టును 2016లో రిడిజైన్‌ పేరుతో తరలిం చారు. రిడిజైన్‌ పేరుతో లక్షల కోట్లతో ప్రాజెక్టు స్వరూపాన్ని రాష్ట్ర ప్రభుత్వం మార్చేసినట్టు ప్రతి పక్షాలు మండిపడుతున్నాయి.

 నిరుపయోగంగా కాల్వలు..

కౌటాల మండలం తుమ్డిహేట్టి గ్రామంలో ప్రాజె క్టు నిర్మించేందుకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం ఈ ప్రాంతంలో భూములను 2009లో సేకరించింది. ఇందుకు రైతుల నుంచి ఒప్పంద పత్రాలు తీసుకొని అవార్డును కూడా ప్రకటించారు. పరిహారం విష యంలో కూడా పూర్తిస్థాయిలో పనులు చేపట్టారు. కొన్ని సమస్యాత్మకంగా ఉన్న వాటి విషయంలో ఎలాంటి పురోగతిలేని పరిస్థితి దాపు రించింది. తుమ్డిహేట్టి నుంచి బెజ్జూరు, పెంచికల్‌ పేట మండలాల మీదుగా కాల్వ నిర్మాణాలు చేప ట్టారు. కాల్వల పనులు భారీగా డిజైన్‌ చేశారు. కేవలం మట్టితవ్వకాలు మాత్రమే చేపట్టారు. ప్రాజెక్టు తరలిపోవడంతో ఇప్పుడు ఏంచేయాలో రైతుల కు అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. ఒక వైపు తవ్వినకాల్వలు వృథాగా దర్శన మిస్తుం డటం పట్ల ప్రభుత్వం చేపట్టిన కోట్లాది డబ్బులు వృధా అయినట్టు రెతులు చెబు తున్నారు. తాము పండించుకునే బంగారు భూములను కూడా చక్కటి ఆశయం కోసం వదిలేశామని, ఇప్పుడు భూమి పోయింది, ప్రాజెక్టులేని పరిస్థితి రావటంపై అంతా అసహనం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ప్రతిపక్షాలవారు ఉద్యమబాట పట్టినా కూడా ఎలాంటి పురోగతిలేని పరిస్థితి.

ఫ ప్రత్యామ్నాయం దిశగా చర్యలు?

కౌటాల తుమ్డిహేట్టి ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ దిశగా చర్యలు చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్టు సమా చారం. రెండుపాయల మధ్యకలిసే సంగ మం వద్ద వంతెనకట్టి ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా కు నీరందించేందుకు వ్యూహరచన చేస్తున్న ట్టు తెలిసింది. ఐతే ఇక్కడ బ్యారేజీ కట్టాల న్నది డిమాండు. ఈ విషయంలో ఎంతటి పోరాటానికైనా వెనుకాడేది లేదని ప్రతిపక్ష నాయకులు ముక్తకంఠంతో పేర్కొంటు న్నారు. బాధిత నిర్వాసితులు, రైతులు కూడా మద్దతు తెలుపుతున్నారు. 

స్పందించక పోవడం విచారకరం..

-ఎల్ములే వెంకయ్య, రైతు, కౌటాల

ప్రాజెక్టు ఈప్రాంతం నుంచి తరలించిన సమయంలో నాయకులు స్పందించిక పోవడం విచారకరం. అధి కారులు ఇప్పటికైనా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి రైతులకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకుంటే బాగుటుంది. రైతుల ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చారు. ప్రస్తుతం ఏమీచేయని పరిస్థితి నెలకొంది. అధికారులు కనీసం ముందుచూపుతో ప్రత్యేకచర్య తీసుకుంటే బాగుండేది. 

ప్రభుత్వం స్పందిస్తే మేలు జరుగుతుంది..

-సిడాం గణపతి, మాజీ జడ్పీ చైర్మన్‌

ప్రభుత్వం స్పందిస్తే రైతులకు మేలు జరుగుతుంది. ఈ విషయంలో త్వరితగతిన చర్యలు చేపట్టాలి. ఇప్పటికే జాప్యం జరిగింది. ప్రాజెక్టు నిర్మాణం ఊసే లేకుండా పోయింది. రైతులకు ఏ మాత్రం ప్రయో జనంలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి కైనా అధికారులు వెంటనే స్పందించి ప్రత్యా మ్నాయ చర్యలుచేపడితే బాగుటుంది. వీలైనంత త్వరగా చర్యలు చేపట్టాలి. ప్రభుత్వ నిర్ణయం పైనే రైతుల భవిష్యత్తు ఉంది.

Updated Date - 2021-03-07T05:53:58+05:30 IST