Jun 7 2021 @ 12:18PM

సీక్రెట్‌గా హీరోయిన్ ఎవ‌లిన్ శర్మ వివాహం

బాలీవుడ్ హీరోయిన్ ఎవ‌లిన్ శ‌ర్మ త‌న బెస్ట్ ఫ్రెండ్, ఆస్ట్రేలియాకు చెందిన తుషార్ బిండిని గ‌త నెల‌లో ర‌హ‌స్యంగా వివాహ‌మాడింది. అయితే ఇప్పుడే పెళ్లి విష‌యాన్ని బ‌య‌ట‌కు తెలియ‌జేసింది. త‌మ పెళ్లి నాటి ఫొటోను షేర్ చేసిన ఎవ‌లిన్ ‘‘బెస్ట్ ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకోవ‌డం కంటే మంచి విష‌య‌మెముంటుంది. వైవాహిక జీవితంలో అడుగు పెట్టినందుకు ఎగ్జ‌యిట్‌గా ఫీల్ అవుతున్నాం’’ అని త‌న భావాల్ని తెలియ‌జేసింది. 2018లో ఓ పార్టీలో ఎవ‌లిన్‌, తుషార్ క‌లుసుకున్నారు. అప్పుడు మొద‌లైన వీరి స్నేహం ప్రేమ‌గా మారి ప‌రిణయానికి దారి తీసింది. 


Bollywoodమరిన్ని...