అనంత ఆస్పత్రిలో కరోనా భయం

ABN , First Publish Date - 2020-04-07T09:50:47+05:30 IST

జిల్లా సర్వజనా స్పత్రిలో కరోనా టెన్షన్‌ కొనసాగుతోంది. హిందూపురంలో బయటపడిన కరోనా పాజిటివ్‌ మూడు

అనంత ఆస్పత్రిలో కరోనా భయం

హిందూపురం నుంచి మూడు పాజిటివ్‌ కేసుల తరలింపు

ఒకరి పరిస్థితి విషమం... ఐసీయూకు తరలింపు

ఆస్పత్రి ఐసొలేషన్‌లో 46 మంది అనుమానితులు

చనిపోయిన వృద్ధుడికి చికిత్స చేసిన వైద్యులు, సిబ్బందికి శాంపిల్స్‌ సేకరణ

22 మందికి హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచన


 అనంతపురం వైద్యం, ఏప్రిల్‌ 6 : జిల్లా సర్వజనా స్పత్రిలో కరోనా టెన్షన్‌ కొనసాగుతోంది. హిందూపురంలో బయటపడిన కరోనా పాజిటివ్‌ మూడు కేసులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమం గా ఉన్నట్లు సమాచారం. దీంతో ఆ వ్యక్తిని ఆస్పత్రిలో ప్ర త్యేకంగా ఏర్పాటు చేసిన ఐసీయూకు తరలించారు. ఇం కోవైపు ఆస్పత్రి ఐసొలేషన్‌, క్వారంటైన్‌లలో దాదాపు 46 మంది వరకూ కరోనా అనుమానితులు చికిత్స పొందుతు న్నారు. హిందూపురం నుంచి కరోనా పాజిటివ్‌తో వచ్చిన వ్యక్తులు ఆస్పత్రి ఐసొలేషన్‌లో ఉండకుండా తిరుగుతు న్నారని ఆస్పత్రి వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు.


ఇప్పటికే హిందూపురం నుంచి వచ్చిన వృద్ధుడు కరోనాతో చికిత్స పొందుతూ జిల్లా ఆస్ప త్రిలో మరణించిన విషయం తెలిసిందే. దీంతో ఆ వృ ద్ధుడికి చికిత్స చేసిన ఆస్పత్రి వైద్యులు, నర్సులు, టెక్నీ షియన్‌లు ఇప్పటికీ తీవ్ర ఆందోళన పడుతున్నారు. ఓ నర్సుకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని ఆదివారం విస్తృత ప్రచారం సాగింది. పోలీసులు, అధికారులు ఆ నర్సు ఉన్న ప్రాంతంలో రాకపోకలు నిలిపివేయించారు. ఆ తర్వాత పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చిందని అధికారులు ప్రకటించారు. అయినా ఆస్పత్రిలో కరోనా సోకిన వృద్ధుడికి చికిత్స చేసిన వైద్యులు, సిబ్బందిలో మాత్రం టెన్షన్‌ వీడలేదు. ఆస్పత్రి ఉన్నతాధికారులు సైతం బయటకు గంభీరం ప్రదర్శిస్తు న్నా లోలోపల వణుకుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో సో మవారం ఆ వృద్ధుడికి వైద్యసేవలందించిన 22 మంది వై ద్యులు, నర్సులు, టెక్నీషియన్‌లకు కరోనా శాంపిల్స్‌ తీ యించారు.


నిర్ధారణ కోసం ల్యాబ్‌కు పంపించారు. మరో వైపు హిందూపురం నుంచి వచ్చిన ఓ పాజిటివ్‌ కేసు పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఆ వ్యక్తిని ట్రామాకేర్‌ సెంటర్‌లో ఏర్పాటుచేసిన ఐసీయూ విభాగానికి తరలించారు. ఈ ఐసీయూలోనే ఇటీవల చేరిన హిందూ పురం వృద్ధుడు మరణించారు. దీంతో అటువైపు వెళ్లాలం టే వైద్యులు, నర్సులు, టెక్నీషియన్‌లు అదరిపోతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ ప్రైవేట్‌ ఆస్పత్రిలో పని చేస్తున్న పెద్దపప్పూరు మండలం వరదాయపల్లికి చెందిన  ఓ నర్సుకి కరోనా లక్షణాలు ఉన్నాయంటూ ప్రచారం సాగింది. దీంతో ఆమెను తాడిపత్రికి తరలించారు. అక్కడి నుంచి అనంత ఆస్పత్రికి తీసుకొచ్చి ఐసొలేషన్‌లో ఉంచి వైద్యసే వలు అందిస్తున్నారు. అలాగే ఇతర ప్రాంతాలకు చెందిన పలువురు అనుమానితులు ఆస్పత్రిలోని కరోనా ఓపీకి క్యూ కట్టారు. సోమవారం దాదాపు 15 మందికి పైగా ఈ ఓపీకి వచ్చి వైద్యపరీక్షలు చేయించుకున్నారు.


అందులో నలుగురిపై వైద్యులు అనుమానం వ్యక్తం చేసి ఆస్పత్రి క్వారంటైన్‌కు తరలించారు. ఇలా జిల్లా ఆస్పత్రికి కరోనా అనుమానితులు, పాజిటివ్‌ కేసులు సంఖ్య పెరిగిపోయింది. దీంతో ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్యులు, నర్సులు, టెక్నీషియన్‌లు భయం భయంగానే విధులు నిర్వర్తిస్తున్నారు. ఇతర జబ్బులున్న రోగులు సైతం జిల్లా ఆస్పత్రికి రావాలంటే కరోనా భయంతో జంకుతున్నారు. 


Updated Date - 2020-04-07T09:50:47+05:30 IST