Abn logo
May 4 2021 @ 01:27AM

ఏటిగడ్డ కిష్టాపూర్‌ గ్రామ నిర్వాసితుల తరలింపు

నిర్వాసితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న పోలీస్‌ సిబ్బంది

50 కుటుంబాలను ఖాళీ చేయించిన అధికారులు

తొగుట, మే 3: మల్లన్నసాగర్‌ ముంపు గ్రామమైన తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్‌ గ్రామానికి చెందిన 50 నిర్వాసిత కుటుంబాలను సోమవారం గజ్వేల్‌ పట్టణం సమీపంలో నిర్మించిన పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు. కాగా ఆదివారం కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి, సర్పంచ్‌ ప్రతా్‌పరెడ్డి తో పాటు గ్రామస్థులు ములుగు గెస్ట్‌హౌ్‌సలో చర్చలు జరిపారు. నిర్వాసితులందరికీ న్యాయం చేయాలని సర్పంచ్‌ ప్రతా్‌పరెడ్డి కోరగా కలెక్టర్‌ సానుకూలంగా స్పందించి హామీ ఇచ్చినట్లు సమాచారం. సోమవారం గ్రామస్థులు ఊరు ఖాళీ చేయడానికి ముందుకు రాగా అధికారులు 50 డీసీఎం వాహనాలను గ్రామానికి పంపించి తొగుట ఎస్‌ఐ శ్రీనివాస్‌ రెడ్డి, ఆర్‌ఐ రవీందర్‌ నేతృత్వంలో నిర్వాసిత కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు.

Advertisement