యాదగిరీశుడికి వైభవంగా నిత్యపూజలు

ABN , First Publish Date - 2022-06-30T06:11:18+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి బుధవారం నిత్యవిధి కైంకర్యాలు వైభవం గా నిర్వహించారు. వేకువజామున సుప్రభాతంతో స్వా మిని మేల్కొలిపిన అర్చకులు గర్భాలయంలో కొలువుదీరి న స్వయంభువులను, సువర్ణ ప్రతిష్ఠా అలంకారమూర్తులను పంచామృతాలతో అభిషేకించి తులసీదళాలతో అర్చించారు. ప్రధానాలయ మొదటి ప్రాకార మండపం లో నిత్యతిరుకల్యాణోత్సవం ఇర్వహించారు.

యాదగిరీశుడికి వైభవంగా నిత్యపూజలు
నిత్యా తిరుకల్యాణోత్సవం నిర్వహిస్తున్న అర్చకులు

యాదగిరిగుట్ట, జూన్‌ 29: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి బుధవారం నిత్యవిధి కైంకర్యాలు వైభవం గా నిర్వహించారు. వేకువజామున సుప్రభాతంతో స్వా మిని మేల్కొలిపిన అర్చకులు గర్భాలయంలో కొలువుదీరి న స్వయంభువులను, సువర్ణ ప్రతిష్ఠా అలంకారమూర్తులను పంచామృతాలతో అభిషేకించి తులసీదళాలతో అర్చించారు. ప్రధానాలయ మొదటి ప్రాకార మండపం లో నిత్యతిరుకల్యాణోత్సవం ఇర్వహించారు. ప్రధానాల య ముఖమండపంలో సువర్ణ పుష్పార్చనలు, అష్టోత్తరా లు, సాయంత్రం అలంకార వెండిజోడు సేవలు, సహస్రనామార్చన పూజలు కొనసాగాయి. అనుబంధ పాతగుట్ట ఆలయంలోనూ నిత్య పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించా రు.పాతగుట్ట దేవాలయంలో కొలువుదీరిన స్వయంభూమూర్తులకు నిజాభిషేకం,నిత్యార్చనలు, నిత్యతిరుకల్యాణోత్సవాలు ఆగమశాస్త్రరీతిలో కొనసాగాయి. వివిధ విభాగాల ద్వారా ఖజానాకు రూ.11,11,069ఆదాయం సమకూరింది. 


స్వామివారిని దర్శించుకున్న మంత్రి దయాకర్‌రావు 

పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబె ల్లి దయాకర్‌రావు స్వామివారిని దర్శించుకున్నారు. ఎమ్మె ల్సీ పోచంపల్లి శ్రీనివా్‌సరెడ్డి, దివ్యాంగుల సంస్థ చైర్మన్‌ వాసుదేవరెడ్డిలతో యాదగిరిక్షేత్రాన్ని సందర్శించారు.   ఆలయ ముఖమండపంలో ఉత్సవమూర్తుల చెంత సువ ర్ణ పుష్పార్చన పూజల్లో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి తన ఇలవేల్పు దైవమని, తరచూ స్వామి దర్శనానికి వస్తుంటానని చెప్పారు. ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం గా సీఎం కేసీఆర్‌ తీర్చిదిద్దాడని చెప్పారు.

Updated Date - 2022-06-30T06:11:18+05:30 IST