అసెంబ్లీలో ఈటల సస్పెన్షన్.. మరమనిషి వ్యాఖ్యలపై రచ్చ రచ్చ..

ABN , First Publish Date - 2022-09-13T16:07:26+05:30 IST

నేడు అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(BJP MLA Etela Rajender) హాజరయ్యారు. లోపలికి ఎంట్రీ ఉందా అని

అసెంబ్లీలో ఈటల సస్పెన్షన్.. మరమనిషి వ్యాఖ్యలపై రచ్చ రచ్చ..

Hyderabad : నేడు అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(BJP MLA Etela Rajender) హాజరయ్యారు. లోపలికి ఎంట్రీ ఉందా అని అసెంబ్లీ చీఫ్ మార్షల్‌(Assembly Chief Marshal)ను అడిగిన అనంతరం ఆయన అసెంబ్లీలోకి అడుగు పెట్టడం గమనార్హం. ఈటలను సభ నుంచి సస్పెండ్ చేస్తారని అసెంబ్లీ లాబీల్లో జోరుగా ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి తగ్గట్టుగానే ఈటలను స్పీకర్ సస్పెండ్ చేశారు. 8వ సెషన్ మూడవ మీటింగ్ ముగిసే వరకూ ఈ సస్పెన్షన్ కొనసాగనుంది. సభ మొదటి రోజు స్పీకర్‌పై మరమనిషి అంటూ ఈటల కామెంట్ చేశారు. ఈటలపై ప్రభుత్వం సీరియస్, క్షమాపణ చెప్పాలని మంత్రులు డిమాండ్ చేశారు.


స్పీకర్‌పై కామెంట్స్‌ను రాజేందర్ సమర్థించుకున్నారు. స్పీకర్‌పై కామెంట్స్‌ను రాజేందర్ సమర్థించుకున్నారు. ఈటల స్పీకర్‌కు క్షమాపణ చెప్పాలని.. మరమనిషి అని అహంకారంతో మాట్లాడారని దాస్యం వినయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. అయితే తాను 12 ఏళ్ల పాటు సభలో ఉన్నానని.. తనకు సభా మర్యాద తెలుసని ఈటల పేర్కొన్నారు. ప్రశాంత్ రెడ్డి సైతం ఈటల క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. తనను సభ నుంచి వెళ్ల గొట్టాలని చూస్తున్నారా? అని ఈటల తిరిగి ప్రశ్నించారు. స్పీకర్ తనను తండ్రి అని సంబోధించారని.. తాను కూడా కొడుకు అనుకుని చెబుతున్నానని సభ మూడ్‌ను అర్థం చేసుకోవాలన్నారు. ఫైనల్‌గా ఈటలను సస్పెండ్ చేశారు. 


Updated Date - 2022-09-13T16:07:26+05:30 IST