Etela Rajender ఓటమి ఎరుగని నేత.. 2004 నుంచి మెజారిటీలు ఇవే..

ABN , First Publish Date - 2021-11-03T12:13:04+05:30 IST

ఈటల రాజేందర్‌ హుజూరాబాద్‌ నియోజకవర్గంలో తిరుగులేని నేతగా మారారు.

Etela Rajender ఓటమి ఎరుగని నేత.. 2004 నుంచి మెజారిటీలు ఇవే..

కరీంనగర్ : ఈటల రాజేందర్‌ హుజూరాబాద్‌ నియోజకవర్గంలో తిరుగులేని నేతగా మారారు. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం తర్వాత పార్టీలో చేరిన ఆయన కమలాపూర్‌ నియోజకవర్గం నుంచి 2004లో పోటీ చేసి టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి ముద్దసాని దామోదర్‌రెడ్డిపై 19,619 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తర్వాత కేసీఆర్‌ పిలుపు మేరకు రాజీనామా చేసి 2008 ఉప ఎన్నికలో దామోదర్‌ రెడ్డిని 22,284 ఓట్ల తేడాతో ఓడించారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009లో హుజూరాబాద్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి వి కృష్ణమోహన్‌ రావుపై గెలుపొందారు. 


ఉద్యమ కాలంలోనే రాజీనామా చేసి 2010 ఉప ఎన్నికలో ముద్ద సాని దామోదర్‌రెడ్డిపై గెలుపొందారు. 2014 ఎన్నికల్లో ఈటల రాజేందర్‌ తిరిగి ఇక్కడి నుంచే పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి కేతిరి సుదర్శన్‌రెడ్డిపై విజయం సాధించారు. 2018లో ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డిపై గెలుపొందారు. ప్రస్తుతం జరిగిన ఉప ఎన్నికలో 23,855 ఓట్ల ఆధిక్యతతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌పై గెలుపొందారు.

Updated Date - 2021-11-03T12:13:04+05:30 IST