Hyderabad : రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో బీజేపీ జెండా(BJP Flag) ఎగరవేస్తామని ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Etela Rajender) పేర్కొన్నారు. దామెర మండలం ఊరుగొండ గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఈటల మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్(CM KCR) రాజకీయ జీవిత కాలం చెల్లిపోయిందన్నారు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అని.. టీఆర్ఎస్(TRS) అరిపోయే దీపమని పేర్కొన్నారు. తెలంగాణ(Telangana)లో లుచ్చా రాజకీయాలకు కేసీఆర్ తెర లేపుతున్నారన్నారు. తెలంగాణలో సంక్షేమ పథకాలు సరిగ్గా అమలు చెయ్యని కేసీఆర్ దేశంలో రాజకీయాలను వెలుగబెడుతారంట అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం వందల కోట్ల నిధులను గోల్ మాల్ చేశారని ఈటెల రాజేందర్ విమర్శించారు.