జగిత్యాల: తెలంగాణలో వచ్చే బీజేపీ ప్రభుత్వమేనని, కేసీఆర్‌ను మేమే గద్దె దించుతామని బిజెపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్(etela rajender) అన్నారు. కేసీఆర్(kcr) శవ రాజకీయాలకు తెర లేపారని ఆయన విమర్శించారు. పంజాబ్ రైతులకు డబ్బులిచ్చారు. మరి తెలంగాణ రైతులు ఏం పాపం చేశారని ఈటల ప్రశ్నించారు. కేసీఆర్ ఎన్ని నాటకాలు ఆడినా తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థతి లేదని ఆయన అన్నారు. కేసీఆర్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి(bjp) ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని ఈటల స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి