యాదాద్రి: రాష్ట్రం వస్తే నీళ్లు, నిధులు నియామకాలు వస్తాయనుకున్నామని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ ప్రజలు ఆశలు అడియాశలయ్యాయన్నారు. కుల్వకుంట్ల కుటుంబం అభివృద్ధే తప్ప ప్రజలు బాగుపలేదన్నారు. అభివృద్ధి జరగలేదనడానికి తుర్కపల్లి మండలమే నిదర్శనమని ఆయన చెప్పారు. రైతులు వరి వేయద్దని హుకుం జారీ చేసిన ఏకైక సీఎం కేసీఆరే అన్నారు. తరుగు పేరుతో రైతులను ఆగం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. దేశంలో ఎక్కువ మద్యం అమ్మకాలు జరిగేది రాష్ట్రంలోనేనని చెప్పారు. ఇక్కడి రైతులను గాలికొదిలేసి పంజాబ్ రైతులకు సాయం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రైతుల చావులు కేసీఆర్‌కు కనిపిస్తేలేవా? అని ప్రశ్నించారు. తెలంగాణలో కాషాయ జెండా ఎగరడం ఖాయమన్నారు.
ఇవి కూడా చదవండి