Abn logo
Jun 15 2021 @ 12:16PM

హైదరాబాద్ చేరుకున్న ఈటల బృందం

హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ బృందం ఢిల్లీ నుంచి హైదారాబాద్ చేరుకుంది. బీజేపీలో చేరిన తర్వాత మొదటిసారి ఈటల హైదరాబాద్‌కు వచ్చారు. ఈ క్రమంలో ఈటలకు బీజేపీ కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టులో ఈటలను ఆయన కొడుకు, కోడలు రిసీవ్ చేసుకున్నారు. నిన్న(సోమవారం) కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో ఈటల రాజేందర్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈటలతో పాటు రమేశ్‌ రాథోడ్‌, రవీందర్‌రెడ్డి, అశ్వత్థామరెడ్డి, తుల ఉమ బీజేపీలో చేరారు.