Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 28 2021 @ 10:15AM

హుజురాబాద్ ఫలితాల తర్వాత.. కేసీఆర్‌లో అసహనం పెరిగిపోయింది: ఈటల

యాదాద్రి: హుజురాబాద్ ఎన్నికల ఫలితాల తర్వాత.. సీఎం కేసీఆర్‌లో అసహనం పెరిగిపోయిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారన్నారు. ఏడేళ్ల నుంచి తెలంగాణ ధాన్యాన్ని కేంద్రం పూర్తిగా కొంటోందన్నారు. రైతాంగం పండించిన ధాన్యంపై మొత్తం పెట్టుబడి కేంద్రమే పెడుతోందన్నారు. ధాన్యం కొనకపోవడంతో రైతులు కల్లాల దగ్గర పడిగాపులు కాస్తున్నారన్నారు. రాజకీయాలు పక్కన పెట్టి ధాన్యం కొనుగోలు చేయాలని ఈటల సూచించారు. తెలంగాణ ధనిక రాష్ట్రం అని చెప్పే కేసీఆర్.. ధాన్యం ఎందుకు కొనుగోలు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. అవసరానికి మించిన ధాన్యం కొనుగోలు చేయమని కేంద్రం ముందే చెప్పినా.. ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోక సీఎం మొద్దు నిద్రలో ఉన్నారని ఈటల విమర్శించారు. 


Advertisement
Advertisement