మొదలైన మున్సిపల్‌ ఎన్నికల వేడి

ABN , First Publish Date - 2021-02-26T06:25:03+05:30 IST

మున్సిపాలిటీ ఎన్నికల సందడి మొదలైంది. మొత్తం 40 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు అన్నింటా, టీడీపీ అభ్యర్థులు 39 వార్డుల్లో నామినేషన్లను దాఖలు చేశారు.

మొదలైన మున్సిపల్‌ ఎన్నికల వేడి
ధర్మవరం మున్సిపల్‌ కార్యాలయం


గెలుపు కోసం అధికార, ప్రతిపక్షాల ముమ్మర యత్నాలు


ధర్మవరంఅర్బన్‌, ఫిబ్రవరి 25: మున్సిపాలిటీ ఎన్నికల సందడి మొదలైంది. మొత్తం 40 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు అన్నింటా, టీడీపీ అభ్యర్థులు 39 వార్డుల్లో నామినేషన్లను దాఖలు చేశారు. అయితే పరిశీలన తరువాత ఎన్నికల అధికారులు 19, 27, 28, 39, 32వార్డుల టీడీపీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించారు. బీజేపీ 18, జనసేన 16, సీపీఎం, సీపీఐ ఒ క్కొక్క స్థానంలో నామినేషన్లు దాఖలు చేశారు. మరికొందరు స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. మార్చి 10న జరగనున్న ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించుకుని మున్సిపాలిటీపై జెండా ఎగురవేయాలని అధికార, ప్రతిపక్షపార్టీల నేతలు శ్రమిస్తున్నారు. ఈ నేపఽథ్యంలో పోటీ నుంచి తప్పుకోవాలని అధికారపార్టీనాయకులు టీడీపీ అభ్యర్థులను బెదిరింపులకు, ప్రలోభాలకు గురిచేస్తున్నట్టు తెలుస్తోంది. టీడీపీ అభ్యర్థులు బయపడకుండా పోటీ నుంచి తప్పుకోమని ఖరాఖండిగా చెబుతూ గెలుపుకోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నా రు. అదేస్థాయిలో వైసీపీ నాయకులు తమ అభ్యర్థులను విజయం తీవ్ర స్థా యిలో ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పోటీలో ఉన్న అభ్యర్థులు ఆయా వార్డుల్లో కలియ తిరుగుతున్నారు. వైసీపీ అభ్యర్థుల తరపున వార్డు వలంటీర్లు ప్ర చారం చేస్తున్నారని బహిరంగంగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే కోవలో బీజేపీ, జనసేన, వామపక్షపార్టీలు ఎవరికివారు తమ వారిని గెలుపించుకునేందుకు తమతమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. మున్సిపాలిటీ ఎ న్నికలను టీడీపీ, వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుండటంతో ఈ ఎన్నికలు రసవత్తరంగా జరుగుతున్నాయి.


Updated Date - 2021-02-26T06:25:03+05:30 IST