Abn logo
Aug 31 2021 @ 18:18PM

ఆరిపోయే దీపం టీఆర్ఎస్‌: ఈటల

కరీంనగర్: హుజురాబాద్‌ ఉపఎన్నికలో టీఆర్ఎస్‌ గెలిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పకుంటానని బీజేపీ నేత, మాజీమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం జమ్మికుంట మండలంలో ఆయన పర్యటించారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హుజురాబాద్‌ ఉప ఎన్నికలో తాను గెలిస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆరిపోయే దీపం టీఆర్ఎస్‌ పార్టీ అన్నారు. కేసీఆర్‌కు ఉద్యమకారుల ఉసురు తగులుతుందని హెచ్చరించారు. హుజురాబాద్ నుంచి కేసీఆర్ పతనం ప్రారంభమైందన్నారు. టీఆర్ఎస్‌ నేతలను ప్రజలు నమ్మడం లేదని ఈటల రాజేందర్ చెప్పారు.