నాడు రాళ్లేసిన వ్యక్తికి నేడు ఎమ్మెల్సీ పదవి!

ABN , First Publish Date - 2021-08-06T08:52:43+05:30 IST

తెలంగాణ ఉద్యమ సమయంలో తనతో పాటు హరీశ్‌రావు, కోదండరాం, దేశపతి శ్రీనివాస్‌ ప్రాణాలకు తెగించి మానుకోటలో జగన్‌ ఓదార్పు యాత్రను అడ్డుకుంటే ..

నాడు రాళ్లేసిన వ్యక్తికి   నేడు ఎమ్మెల్సీ పదవి!

అన్ని కులాల పేదలకూ రూ.10 లక్షలు ఇవ్వాలి

ఆగిన చోట నుంచే పాదయాత్ర మొదలు: ఈటల

హైదరాబాద్‌/హుజూరాబాద్‌, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఉద్యమ సమయంలో తనతో పాటు హరీశ్‌రావు, కోదండరాం, దేశపతి శ్రీనివాస్‌ ప్రాణాలకు తెగించి మానుకోటలో జగన్‌ ఓదార్పు యాత్రను అడ్డుకుంటే తమపై రాళ్లేసి, తమ రక్తాన్ని కళ్ల జూసిన వ్యక్తికి సీఎం కేసీఆర్‌ ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని బీజేపీ నేత ఈటల రాజేందర్‌ అన్నారు. కేసీఆర్‌ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధినే కోరుకుంటే దళితులతో పాటు సంచార జాతులు, ఇతర కులాల్లోని పేదలందరికీ రూ.10 లక్షల సాయాన్ని ఎన్నికల నోటిఫికేషన్‌లోగా అందించాలని డిమాండ్‌ చేశారు. నిరుద్యోగ యువతకు రూ.3,116 భృతిని వెంటనే అమలు చేయాలని, దళిత బంధు పథకాన్ని రాష్ట్రమంతటా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. గురువారం అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అనంతరం హైదరాబాద్‌, హుజూరాబాద్‌లో ఈటల మీడియాతో మాట్లాడారు. హుజూరాబాద్‌లో వందల మంది పోలీసులు మఫ్టీలో ఒక్కో కుటుంబాన్ని టార్గెట్‌ చేసి అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. వైద్యుల సూచన మేరకు నాలుగైదు రోజులు విశ్రాంతి తీసుకొని ఆగిన చోట నుంచే పాదయాత్రను ప్రారంభిస్తానన్నారు. కాగా అపోలో ఆస్పత్రి నుంచి ఈటల గురువారం డిశ్చార్జి అయ్యారు. 

Updated Date - 2021-08-06T08:52:43+05:30 IST