Abn logo
Oct 17 2021 @ 12:56PM

రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు అమలు చేయాలి: ఈటల

కరీంనగర్ జిల్లా: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం దళిత బంధు పథకం అమలు చేయాలని బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రచారంలో భాగంగా ఆయన ఆదివారం  పోతిరెడ్డిపేటలో మాట్లాడుతూ.. ఈటల మొహం అసెంబ్లీలో కనపడద్దని సీఎం కేసీఆర్ అనుకుంటున్నారన్నారు. ఈనెల 30న జరగనున్నపోలింగ్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వేసి చెంప చెల్లుమనిపించాలని పిలుపు ఇచ్చారు. తనను మంత్రి వర్గం నుంచి వెలగొట్టారని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఒత్తిడి తెచ్చారన్నారు. తాను గెలిస్తే  ప్రగతి భవన్, ఫామ్ హౌస్‌లో పడుకున్న సీఎం కేసీఆర్ బయటకు వస్తారన్నారు. మాట ఇచ్చి మాట తప్పే వ్యక్తి కేసీఆర్ అని ఈటల రాజేందర్ విమర్శించారు.