ఖమ్మం: తెలంగాణలో కేసీఆర్ పాలన నిజాం నిరంకుశ పాలనను మించిపోయిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఆత్మహత్య చేసుకున్న బీజేపీ కార్యకర్త సాయి గణేష్ కుటుంబాన్ని బుధవారం బీజేపీ నేతలు పరామర్శించారు. ఈ సందర్బంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ టిఆర్ఎస్ నేతలు, పోలీసులు అమాయక ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. శిశుపాలుడు ఏ విధంగా 100 తప్పులు చేసి శిక్షకు గురయ్యాడో సీఎం కేసీఆర్ కూడా వంద తప్పులు చేశారని, ఇక శిక్ష తప్పదని అన్నారు. సాయి గణేష్ ఆత్మహత్యకు కారకులైన టిఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రజానీకం కేసీఆర్పై విశ్వాసం కోల్పోయారని ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అక్రమాలకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయన్నారు. కేసీఆర్ను గద్దెదించే సమయం ఆసన్నమైందన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధైర్యపడొద్దని, ప్రతి ఒక్క కార్యకర్తను కాపాడుకుంటామని, ధైర్యంగా పోరాడదామని అన్నారు. సాయి గణేష్ కుటుంబానికి అండగా నిలబడతామని ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి