Abn logo
Aug 30 2021 @ 22:34PM

సీఎం కేసీఆర్‌కు ఈటల రాజేందర్ సవాల్

హన్మకొండ: సీఎం కేసీఆర్‌కు మాజీమంత్రి ఈటల సవాల్ విసిరారు. హుజూరాబాద్‌లో ఓడిపోతే సీఎం పదవికి కేసీఆర్‌ రాజీనామా చేయాలని, తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని స్పష్టంచేశారు. ‘‘హరీష్‌రావు గుర్తుపెట్టుకో నాకు జరిగిన అవమానమే నీకూ జరుగుతుంది. గొర్రెల మందపై తోడేళ్ళు పడినట్టు, పంటచేలపై మిడతలదండు పడినట్టు.. హుజురాబాద్‌పై మంత్రులు, ఎమ్మెల్యేలు పడ్డారు. కేసీఆర్‌కు దమ్ముంటే ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించాలి.’’ అని ఈటల సూచించారు.