హరీశ్‌రావుపై ఈటల ఫైర్

ABN , First Publish Date - 2021-11-04T21:30:16+05:30 IST

మంత్రి హరీశ్‌రావుపై ఎమ్మెల్యే ఈటల ఫైర్ అయ్యారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సిద్ధిపేట ప్రజలు హరీశ్‌రావును గెలిపిస్తే..

హరీశ్‌రావుపై ఈటల ఫైర్

సిద్ధిపేట: మంత్రి హరీశ్‌రావుపై ఎమ్మెల్యే ఈటల ఫైర్ అయ్యారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సిద్ధిపేట ప్రజలు హరీశ్‌రావును గెలిపిస్తే.. ఆయన అధర్మం, అన్యాయం, దౌర్జన్యం పక్షాన నిలబడ్డారని తప్పుబట్టారు. హరీశ్‌రావు ఏ కుట్రలను, డబ్బులను మద్యాన్ని, దాబాయింపులను నమ్ముకున్నాడో వాటికే ఆయన బలయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో దళిత బంధు అమలు చేశారని, ఆ దళిత బంధును తెలంగాణ అంతటా అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిద్దిపేటలో కూడా దళిత గర్జన పెట్టే రోజు వస్తుందని, దానికి తానే నాయకత్వం వహిస్తానని ఈటల రాజేందర్ ప్రకటించారు. 

Updated Date - 2021-11-04T21:30:16+05:30 IST