Great Indian Investment Festival: చక్కటి ఆరోగ్య అలవాట్ల కోసం ఈటీ మనీ గ్రేట్ ఇండియన్ ఇన్వెస్ట్‌మెంట్ ఫెస్టివల్

ABN , First Publish Date - 2022-10-05T00:04:37+05:30 IST

ఈ పండుగ సీజన్‌లో ఆదా చేసుకోవడం, పెట్టుబడులపై భారతీయులకు అవగాహన కల్పించడంతోపాటు ఈ

Great Indian Investment Festival: చక్కటి ఆరోగ్య అలవాట్ల కోసం ఈటీ మనీ గ్రేట్ ఇండియన్ ఇన్వెస్ట్‌మెంట్ ఫెస్టివల్

న్యూఢిల్లీ: ఈ పండుగ సీజన్‌లో ఆదా చేసుకోవడం, పెట్టుబడులపై భారతీయులకు అవగాహన కల్పించడంతోపాటు ఈ దిశగా ప్రోత్సహించేందుకు దేశంలోనే అతిపెద్ద  వెల్త్‌ టెక్‌ యాప్స్‌లో ఒకటైన ఈటీ మనీ (ET Money) యాప్‌ ఇప్పుడు ‘గ్రేట్‌ ఇండియన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫెస్టివల్‌’(Great Indian Investment Festival)ను ప్రారంభించింది. దీని ఈటీ మనీ (ET Money) ఇప్పుడు వినియోగదారుల నడుమ చక్కటి ఆర్థిక అలవాట్లు చేసుకోవడాన్ని ప్రోత్సహిస్తోంది. దాదాపు 17 రోజుల పాటు జరిగే ఈ పండుగ ద్వారా ఈ యాప్‌ ఇప్పుడు వినియోగదారులకు పండుగ రాయితీలను ఈటీ మనీ (ET Money) జీనియస్‌ పై అందించడంతో  పాటుగా  ప్రోత్సాహకాలను సైతం అందిస్తోంది. వీటిలో షాపింగ్‌ ఓచర్లు, లైఫ్‌ స్టైల్‌ సబ్‌స్ర్కిప్షన్స్‌, రోజువారీ లక్కీ డ్రాలు, బంపర్‌ ప్రైజ్‌లు ఉన్నాయి. ఈ ఆఫర్‌లో భాగంగా అందించే భారీ ప్రైజ్‌లలో  తాజా ఐ ఫోన్‌ 14 ప్లస్‌ ,  ఐపాడ్‌ ఎయిర్‌, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఇంటర్‌సెప్టర్‌ బైక్‌ ఉన్నాయి. మదుపరులు రూ. 2 లక్షలు గెలుచుకునే అవకాశం కూడా ఉంది. దీనికోసం వారు తమ స్నేహితులు, కుటుంబసభ్యుల నడుమ చక్కటి ఆర్థిక అలవాట్లును రిఫరల్‌ చేయాల్సి ఉంటుంది.

 

గ్రేట్‌ ఇండియన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫెస్టివల్‌‌పై ఈటీ మనీ ఫౌండర్‌ అండ్‌ సీఈఓ  ముకేశ్ కల్రా మాట్లాడుతూ.. మనకు వాస్తవంగా అవసరం లేనప్పటికీ పండుగ సీజన్‌లో ఆఫర్లు,  రాయితీలు లభించడం వల్ల మనలో చాలామంది ఈ సీజన్‌లో కొనుగోళ్లు చేస్తుంటారని అన్నారు. దీని కారణంగా మన నెలవారీ బడ్జెట్స్‌పై ప్రభావం పడటంతో పాటుగా భవిష్యత్ ఆర్థిక ప్రణాళికలు, పొదుపు లక్ష్యాలు సైతం ప్రభావితమవుతాయని పేర్కొన్నారు. భారతీయులు తెలివిగా పెట్టుబడులు పెట్టడాన్ని ప్రోత్సహిస్తూ ఈ ఇన్వెస్ట్‌మెంట్‌  ఫెస్టివల్‌ ప్రారంభించినట్టు చెప్పారు. దీనిద్వారా పెట్టుబడులు పెట్టడమనేది శాశ్వత అలవాటుగా మారుస్తున్నట్టు తెలిపారు. దీనిని పండుగ సీజన్‌తో ప్రారంభించినట్టు వివరించారు. ఈ వినూత్న కార్యక్రమం ద్వారా  వ్యక్తులు, వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు దీర్ఘకాలపు సంపద సృష్టించుకోగలరని నమ్ముతున్నట్టు ముకేశ్ కల్రా పేర్కొన్నారు. 

Updated Date - 2022-10-05T00:04:37+05:30 IST