Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఈస్ట్రోజన్‌ ఎక్కించి చూద్దాం!!

వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 29: మహిళల సంతానోత్పత్తి వ్యవస్థలో కీలకమైన ఈస్ట్రోజన్‌, ప్రొజెస్టెరాన్‌ హార్మోన్ల ప్రభావం వల్లే కరోనా వైరల్‌ ఇన్ఫెక్షన్లను ఎదుర్కొనేలా రోగ నిరోధక వ్యవస్థకు బలం చేకూరుతోందనే అంచనాకు శాస్త్రవేత్తలు వచ్చారు. వైర్‌సల దాడితో దెబ్బతినే శరీర కణాల మరమ్మతులు వేగంగా జరిగేందుకూ ఈ హార్మోన్లే ఊతమిస్తున్నాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. టర్కీలో ఓ 93 ఏళ్ల వృద్ధురాలు కరోనాను జయించి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన ఘట్టాన్ని అందుకు ఓ తార్కాణంగా చెప్పారు. ఈనేపథ్యంలో చైనాతో పాటు అమెరికాలోని సెడార్స్‌-సినాయ్‌, రెనెజాన్స్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ శాస్త్రవేత్తలు మహిళల సంతానోత్పత్తి హార్మోన్లతో పురుష కరోనా రోగులపై ప్రయోగ పరీక్షలు జరిపేందుకు సిద్ధమవుతున్నారు.

Advertisement
Advertisement