సంతానోత్పత్తికి కారణమయ్యే హార్మోను వల్లే ఈ సమస్య..

ABN , First Publish Date - 2020-03-20T19:59:49+05:30 IST

స్త్రీలో సంతానోత్పత్తికి కారణమయ్యే ఈస్ట్రోజన్ హార్మోను వల్ల ఆమెలో అలర్జీ సమస్యలు ఎక్కువగా తలెత్తే ప్రమాదం ఉందంటున్నారు వియన్నా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు. పూల నుంచి

సంతానోత్పత్తికి కారణమయ్యే హార్మోను వల్లే ఈ సమస్య..

ఆంధ్రజ్యోతి(20-03-2020):


స్త్రీలలో అలర్జీకి కారణం?

స్త్రీలో సంతానోత్పత్తికి కారణమయ్యే ఈస్ట్రోజన్ హార్మోను వల్ల ఆమెలో అలర్జీ సమస్యలు ఎక్కువగా తలెత్తే ప్రమాదం ఉందంటున్నారు వియన్నా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు. పూల నుంచి వచ్చే పుప్పొడి వారిలో త్వరగా అలర్జీ సమస్యలను కలిగిస్తాయట. కొన్ని రకాల ఆహారపదార్థాలు సరిపడకపోవడం (ఫుడ్ అలర్జీ), ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులూ త్వరగా తలెత్తుతాయట. పదేళ్ల వయసు వరకూ మగపిల్లలు త్వరగా అలెర్జీ బారిన పడతారనీ, ఆ తరువాత కాలంలో ఆడవారిలో ఈ సమస్య తరచుగా కనపడుతుందని వారు అంటునారు. స్త్రీ శరీరంలోని హార్మోనులలో వచ్చే మార్పులే ఇందుకు కారణమని గమనించారు. ఆడవారిలోని ఈస్ట్రోజన్ హార్మోను వల్ల శరీరంలోని కణజాలం త్వరగా వాపు (inflammation) చెందుతుంది. శరీరాన్ని రక్షించుకునేందుకు ఈ వాపు అవసరమే అయినా, ఒక్కో సందర్భంలో ఇది అలెర్జీకి దారితీస్తుంది. హార్మోన్లకీ, అలెర్జీకీ ఉన్న సంబంధం ఇప్పుడిప్పుడే బయటపడుతోందనీ దీని మీద ఇంకా పరిశోధనలు నిర్వహించాలని పరిశోధకులు చెబుతున్నారు.



Updated Date - 2020-03-20T19:59:49+05:30 IST