గ్లామర్‌ లుక్‌లో ‘దృశ్యం’ భామ.. ఫొటోలు వైరల్

మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ - మీనా జంటగా నటించిన ‘దృశ్యం’ చిత్రం మొదటి, రెండు భాగాల్లో కుమార్తెగా నటించిన నటి ఎస్తర్‌ అనిల్‌. ఆ తర్వాత ఈ మూవీ తమిళంలోకి రీమేక్‌ అయింది. ఇందులోనూ ఆమె కమల్‌ హాసన్‌ - గౌతమి కుమార్తెగా నటించింది. తెలుగులో వెంకటేష్, మీనాల కుమార్తెగా నటించింది. ఈ చిత్రాలన్నీ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అలాగే, సినిమా రంగంలో మంచి గుర్తింపు దక్కించుకున్న ఎస్తర్‌.. ఇపుడు సోలో హీరోయిన్‌ పాత్రల కోసం అన్వేషణ మొదలుపెట్టింది.


ఇప్పటికే రెండు పదుల వయసుదాటిన ఈమె హీరోయిన్‌ వేషం కోసం ముమ్మరంగా ప్రయత్నాలు మొదలుపెట్టి గ్లామర్‌ లుక్‌లో కనిపించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ప్రత్యేక ఫొటో షూట్‌లను నిర్వహిస్తూ, వాటిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తోంది. తాజాగా ఆమె బ్లాక్‌ డ్రస్‌లో దిగిన ఫొటోలను షేర్‌ చేసింది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement