కలెక్టరేట్‌లో కొవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూం ఏర్పాటు

ABN , First Publish Date - 2021-04-21T05:58:53+05:30 IST

కరోనా కట్టడిలో భాగంగా మంగళవారం నుంచి కలెక్టరేట్‌లోని కొవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూంకు ఫోన్‌ సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ ఎం. హరినారాయణన్‌ తెలిపారు.

కలెక్టరేట్‌లో కొవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూం ఏర్పాటు

 టోల్‌ ఫ్రీ నెంబరు 104

చిత్తూరు కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 20: కరోనా కట్టడిలో భాగంగా మంగళవారం నుంచి కలెక్టరేట్‌లోని కొవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూంకు ఫోన్‌ సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ ఎం. హరినారాయణన్‌ తెలిపారు. కమాండ్‌ కంట్రోల్‌ రూం టోల్‌ ఫ్రీ నెంబరు 104, 08572- 242732, 242734, 9849902379 నంబర్లకు ఫోన్‌ చేస్తే కరోనా టెస్టింగ్‌, అడ్మిషన్లకు సంబంధించి సలహాలు, సూచనలు అందిస్తామన్నారు. 24 గంటలు పనిచేసే కంట్రోల్‌ రూం వద్ద మూడు షిప్టుల్లో వైద్య ఆరోగ్య సిబ్బంది, ఇతర అధికారులు పనిచేస్తారని చెప్పారు.


Updated Date - 2021-04-21T05:58:53+05:30 IST