ప్రభుత్వ భూమిలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు

ABN , First Publish Date - 2021-06-25T06:10:41+05:30 IST

మండలంలోని విప్పాకఅగ్రహారం సర్వే నంబరు 2/2లో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిలో గురువారం తహసీల్దార్‌ రమాదేవి ఆదేశాల మేరకు ఆర్‌ఐ రమణ, వీఆర్వో శేషు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు.

ప్రభుత్వ భూమిలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు
విప్పాకఅగ్రహారం సర్వే నెంబరు 2/2 ప్రభుత్వ భూమిలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేస్తున్న రెవెన్యూ అధికారులు

సబ్బవరం, జూన్‌ 24 : మండలంలోని విప్పాకఅగ్రహారం సర్వే నంబరు 2/2లో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిలో గురువారం తహసీల్దార్‌ రమాదేవి ఆదేశాల మేరకు ఆర్‌ఐ రమణ, వీఆర్వో శేషు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్‌ఐ మాట్లాడుతూ గ్రామం సర్వే నంబరు 2/2లో 0.40 సెంట్ల ప్రభుత్వ భూమి ఉందన్నారు. ఆ భూమిని కొంత మంది 12 ప్లాట్లుగా విభజించి విక్రయిస్తున్నట్టు తమకు సమాచారం అందిందన్నారు. ఈ మేరకు అక్కడికి వెళ్లి పరిశీలిస్తే రాళ్లు పాతి ఉన్నాయన్నారు. వాటిని తొలగించి హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశామని చెప్పారు. 

----


Updated Date - 2021-06-25T06:10:41+05:30 IST