ఆక్సిజన్‌ సరఫరాపై పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు

ABN , First Publish Date - 2021-05-09T08:57:34+05:30 IST

రాష్ట్రంలో కొవిడ్‌ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ సరఫరా పర్యవేక్షణకు కోసం ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర ఆక్సిజన్‌ కొరత, ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ‘ఊపిరాడడం లేదు’ అన్న శీర్షికతో

ఆక్సిజన్‌ సరఫరాపై పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు

అమరావతి, మే 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొవిడ్‌ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ సరఫరా పర్యవేక్షణకు కోసం ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర ఆక్సిజన్‌ కొరత, ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ‘ఊపిరాడడం లేదు’ అన్న శీర్షికతో ఆంధ్రజ్యోతి శనివారం కథనం ప్రచురించింది. దీనిపై ప్రభుత్వం స్పందించింది. కొవిడ్‌ కమాండ్‌ సెంటర్‌కు అనుబంధంగా ఆక్సిజన్‌ మానిటరింగ్‌ సెల్‌ను కూడా ఏర్పాటుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ఉత్తర్వులిచ్చారు. ఈ కమిటీలో ఐఏఎస్‌ అధికారులు దిల్లీరావు, రాజాబాబు, పరిశ్రమల శాఖ డీడీ ఎం.సుధాకర్‌బాబు, పరిశ్రమల శాఖ కమిషనర్‌ నామినేట్‌ చేసిన  ముగ్గురు కన్సల్టెంటు,్ల డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ అన్వే్‌షరెడ్డి, ఆర్టీఐ పూమేంద్ర, మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రవీణ్‌లు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ప్రత్యేక అధికారికగా ఏపీ హైగ్రేడ్‌ స్టీల్స్‌ లిమిటెడ్‌ ఎండీ షన్‌మోహన్‌ను నియమించారు.  

Updated Date - 2021-05-09T08:57:34+05:30 IST