జిల్లాలో కొవిడ్‌ కేర్‌ సెంటర్ల ఏర్పాటు

ABN , First Publish Date - 2022-01-22T04:46:34+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నియోజకవర్గ స్థాయిలో కొవిడ్‌ కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ రమణకుమారి శక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

జిల్లాలో కొవిడ్‌ కేర్‌ సెంటర్ల ఏర్పాటు
విజయనగరంలో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను పరిశీలిస్తున్న వైద్యాధికారులు

రింగురోడ్డు, జనవరి 21:  జిల్లాలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నియోజకవర్గ స్థాయిలో కొవిడ్‌ కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ రమణకుమారి శక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విజయనగరం నియోజ కవర్గానికి 3, ఎస్‌.కోటలో 2, మిగిలిన నియోజకవర్గాలకు ఒకటి చొప్పున కేర్‌ సెం టర్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. హోమ్‌ ఐసోలేషన్లో ఉండేందుకు వీలు కాని వారు ఈ సెంటర్లలో చేరితే, ఉచితంగా వసతి, భోజన, వైద్య సదుపాయాలు అంది స్తామన్నారు. ఈ అవకాశాన్ని బాధితులు వినియోగించుకోవాలని కోరారు. 

నియోజకవర్గాల వారీగా కేర్‌ సెంటర్లు 

---------------------------------------------------------------------

నియోజకవర్గం             ప్రదేశం      నోడల్‌ అధికారి  ఫోన్‌ నెంబర్లు

--------------------------------------------------------------------

విజయనగరం   ఐఎమ్‌ఏ ఫంక్షన్‌ హాల్‌   పెద్దిరాజు-8179285684

               కృషి భవన్‌             కూర్మినాయుడు-7093930102

              గిరిజన భవన్‌            విజయ్‌కుమార్‌-9849909080

నెల్లిమర్ల       టీటీడీ కల్యాణమండపం   వైవీ రమణ-9989932802

గజపతినగరం  వాసవి కల్యాణమండపం  ఎస్‌ఏ నాయుడు-9100109161

ఎస్‌ కోట      ఎస్‌ఆర్‌ కల్యాణమండపం  జె.రవివర్మ - 9849183817

              వైకే బీఈడీ కళాశాల      వెంకటేశ్వరరావు-9491035889

చీపురుపల్లి    ఆఫీసర్స్‌ క్లబ్‌              కె.రాజేష్‌ - 9100200749

కురుపాం     షిర్డీ సాయి కళాశాల       జి.శ్రీనివాస్‌-8074728874

సాలూరు     వైఎంసీఏ                 షామ్‌కుమార్‌-7331154727

పార్వతీపురం  వైటీసీ వైకేఎం             సురేష్‌ - 6303507116

బొబ్బిలి       ఏపీ ఐఐఈ               డి.కీర్తి- 9494841617

 

Updated Date - 2022-01-22T04:46:34+05:30 IST