అత్యవసర సేవలకు కోవిడ్‌ 19 పోలీసు కంట్రోల్‌ రూం ఏర్పాటు

ABN , First Publish Date - 2020-03-28T11:53:02+05:30 IST

లాక్‌డౌన్‌ సందర్భంగా అత్యవసర సేవలు అందించేందుకు కోవిడ్‌ 19 పోలీస్‌ కంట్రోల్‌ రూం ఏర్పాట్లు చేస్తున్నట్లు వనపర్తి

అత్యవసర సేవలకు కోవిడ్‌ 19 పోలీసు కంట్రోల్‌ రూం ఏర్పాటు

జిల్లా ఎస్పీ అపూర్వరావు 


వనపర్తి క్రైమ్‌, మార్చి 27: లాక్‌డౌన్‌ సందర్భంగా అత్యవసర సేవలు అందించేందుకు కోవిడ్‌ 19 పోలీస్‌ కంట్రోల్‌ రూం ఏర్పాట్లు చేస్తున్నట్లు వనపర్తి జిల్లా ఎస్పీ అపూర్వారావు చెప్పారు. లాక్‌డౌన్‌ అమలులో ఉన్నంత వరకు కంట్రోల్‌ రూం పని చేస్తుందని తెలిపారు. శుక్రవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు.


కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ కోసం అమలవుతున్న లాక్‌డౌన్‌లో జిల్లా ప్రజలు ఎంతగానో సహకరిస్తున్నారని, వారికి మెడికల్‌ ఎమర్జెన్సీ, ఇతర అత్యవసర పరిస్థితులు, నిత్యావసర వస్తువుల రవాణా విషయమై ఈ కంట్రోల్‌ రూమ్‌ సేవలను వినియోగించుకోవాలని ఎస్పీ కోరారు. కంట్రోల్‌ రూమ్‌ నెంబర్‌ - 08545 233331, వాట్సప్‌ నెంబరు - 6303923211, సీసీఎస్‌ సీఐ - 7901100542లకు సంప్రదించాలని ఆమె కోరారు.

Updated Date - 2020-03-28T11:53:02+05:30 IST