Abn logo
May 15 2021 @ 23:56PM

కొవిడ్‌ బాధితులకు హెల్ప్‌లైన్‌ కేంద్రం ఏర్పాటు

   సెంచూరియన్‌ యూనివర్శిటీ వీసీ రాజు వెల్లడి

నెల్లిమర్ల, మే 15: కొవిడ్‌ బాధితులకు అత్యవసర సమాచారాన్ని అందజేసేందుకు టెక్కలిలోగల సెంచూరియన్‌ యూనివర్శిటీలో ‘సెంచూరియన్‌ కొవిడ్‌ హెల్ప్‌లైన్‌’ పేరిట కేంద్రాన్ని ప్రారంభించినట్టు యూనివర్శిటీ వైస్‌ చాన్సలర్‌ ఆచార్య జీఎస్‌ఎన్‌ రాజు వెల్లడించారు. ఆయన శనివారం విలేకర్లతో మాట్లాడారు. ఈ కేంద్రంలో తెలుగు, ఇంగ్లీషు, హిందీ, ఒడియా భాషలు మాట్లాడే సుమారు 50 మంది స్వచ్ఛంద కార్యకర్తలు పనిచేస్తున్నారని చెప్పారు. ఈ హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 9059810827గా తెలియజేశారు. సెంచూరియన్‌ విద్యాసంస్థల వైస్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ డీఎన్‌ రావు, డాక్టర్‌ చైతన్య, డాక్టర్‌ గోపీనాథ్‌, డాక్టర్‌ ఆచార్యులు, డాక్టర్‌ అనితా పాత్రో ఆధ్వర్యంలో ఈ సహాయ కేంద్రం నడుస్తున్నదని ఆయన తెలిపారు. టెక్కలి యూనివర్శిటీతో పాటు ఒడిశాలోని పర్లాఖిమిడి, తెలంగాణ సెంచూరియన్‌ యూనివర్శిటీల సమన్వయంతో నడుపుతున్నట్లు ఆయన చెప్పారు.


Advertisement
Advertisement
Advertisement