పోలవరంలో తొలి గడ్డర్‌ ఏర్పాటు

ABN , First Publish Date - 2020-07-07T09:00:31+05:30 IST

పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే నిర్మాణంలో అతి కీలకమైన స్లాబ్‌ పనుల్లో భాగంగా 45, 46 బ్లాకులపై తొలి గడ్డర్‌ను ..

పోలవరంలో తొలి గడ్డర్‌ ఏర్పాటు

ఊపందుకున్న స్పిల్‌వే పనులు 


పోలవరం, జూలై 6: పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే నిర్మాణంలో అతి కీలకమైన స్లాబ్‌ పనుల్లో భాగంగా 45, 46 బ్లాకులపై తొలి గడ్డర్‌ను సోమవారం అమర్చారు. పోలవరం పస్‌ఈ నాగిరెడ్డి, జలవనరుల శాఖ అధికారులు, మెగా కంపెనీ ఇంజనీర్లు పూజలు చేసి పనిని ప్రారంభించారు. స్పిల్‌వేలో ఇప్పటి వరకూ 52  బ్లాకులలో 52 పియర్స్‌ 52 మీటర్ల ఎత్తున నిర్మాణం పూర్తయింది. స్లాబ్‌ పనుల ప్రారంభానికి ముందుగా పియర్స్‌ పై స్పిల్‌వే 2 కిలోమీటర్ల పొడవునా 196 గడ్డర్లను అమర్చవలసి ఉంటుంది.


ఇప్పటికే 110 గడ్డర్లను సిద్ధం చేశారు. నెలాఖరుకు వాటిని అమరుస్తామని, మిగిలిన 86 గడ్డర్లను నెలాఖరు నాటికి సిద్ధం చేస్తామని ఎస్‌ఈ తెలిపారు. మార్చి నాటికి స్పిల్‌వే పూర్తిస్థాయిలో గేట్ల అమరికతో సహా పూర్తవుతుందన్నారు. స్పిల్‌వే స్లాబ్‌ పటిష్టంగా ఉండేందుకు ఒక్కో గడ్డర్‌ నిర్మాణంలో 25 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌, 10 టన్నుల ఇనుము ఉపయోగించారు. ఒక్కో గడ్డర్‌ బరువు 62 టన్నులు, 22 మీటర్ల పొడవు, రెండున్నర మీటర్ల ఎత్తుంటుందని అధికారులు తెలిపారు.

Updated Date - 2020-07-07T09:00:31+05:30 IST