జమ్మూ కశ్మీర్‌లో క్షేత్ర విద్యా సంస్థ ఏర్పాటు?

ABN , First Publish Date - 2022-05-28T10:13:36+05:30 IST

హైదరాబాద్‌, మే 27 (ఆంధ్రజ్యోతి): జమ్మూ కశ్మీర్‌లో క్షేత్ర విద్యా సంస్థను ఏర్పాటు చేసే అంశపై ఆ సంస్థ ప్రతినిధులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ కుమార్‌

జమ్మూ కశ్మీర్‌లో క్షేత్ర విద్యా సంస్థ ఏర్పాటు?

- కేంద్ర మంత్రితో హైదరాబాద్‌ విద్యాసంస్థల ప్రతినిధుల చర్చలు

హైదరాబాద్‌, మే 27 (ఆంధ్రజ్యోతి): జమ్మూ కశ్మీర్‌లో క్షేత్ర విద్యా సంస్థను ఏర్పాటు చేసే అంశపై ఆ సంస్థ ప్రతినిధులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ కుమార్‌ మిశ్రాతో చర్చలు జరిపారు. జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దుతో వివిధ విభాగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం సరికొత్త ప్యాకేజీలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ గాయత్రి విద్యా సంస్థల వ్యవస్థాపకుడు పీవీఆర్కే మూర్తి, పారమిత విద్యాసంస్థల వ్యవస్థాపకుడు ప్రసాదరావు, ఒయాసిస్‌ విద్యా సంస్థల వ్యవస్థాపకులు జే.ఎస్‌ పరంజ్యోతిలు సంయుక్తంగా నిర్వహిస్తున్న క్షేత్ర విద్యా సంస్థలను జమ్మూ కశ్మీర్‌లో ప్రారంభించే అంశంపై కేంద్ర మం త్రి, ఐఏఎస్‌ అధికారి అనంత కిశోర్‌ శరణ్‌లతో శుక్రవారం కశ్మీర్‌లో చర్చించారు. జమ్మూ కశ్మీర్‌లో విద్యాసంస్థలను ప్రారంభించేందుకు సహాయ సహకారాలను అందిస్తామని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి చెప్పారు. 

Updated Date - 2022-05-28T10:13:36+05:30 IST