ప్లీనరీ విజయవంతానికి కమిటీల ఏర్పాటు: కేటీఆర్‌

ABN , First Publish Date - 2022-04-18T22:48:13+05:30 IST

టీఆర్‌ఎస్‌ ప్లీనరీ విజయవంతం చేసేందుకు కమిటీలు ఏర్పాటు చేసినట్లు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

ప్లీనరీ విజయవంతానికి కమిటీల ఏర్పాటు: కేటీఆర్‌

హైదరాబాద్: టీఆర్‌ఎస్‌  ప్లీనరీ విజయవంతం చేసేందుకు కమిటీలు ఏర్పాటు చేసినట్లు  టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి  కేటీఆర్‌ తెలిపారు.  నగరంలోని  HICCలో టీఆర్ఎస్ ఆవిర్భావ సభ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి  కేటీఆర్ హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘ఈ నెల 27వ తేదీన టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు.ప్రతినిధులు అంత పది గంటల్లోగా సమావేశ ప్రాంగణానికి చేరుకోవాలి.మొదట రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.పదకొండు గంటలకు కేసీఆర్ ప్రాంగణానికి చేరుకొని పార్టీ జెండా ఆవిష్కరిస్తారు.అనంతరం తీర్మానాలు...వాటిపై చర్చలుంటాయి.టీఆర్‌ఎస్‌   21 ఏళ్లు నిండటం ఓ మైలురాయి. 27వ తేదీన 11 గంటల నుంచి అన్ని గ్రామాలు, బస్తీల్లో జెండా ఆవిష్కరణ చేయాలి.రంగారెడ్డి జిల్లా నేతల ఆధ్వర్యంలో ఆహ్వాన కమిటీ, మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో అలంకరణ కమిటీ.ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆధ్వర్యంలో ప్రతినిధుల రిజిస్ట్రేషన్, వలంటీర్లు వ్యవస్థ పార్కింగ్‌కు సంబంధించి ఎమ్మెల్యే వివేకానంద ఆధ్వ ర్యంలో కమిటీ. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో పుడ్ కమిటీ.మధుసూదనచారి, పార్టీ కృష్ణ మూర్తి, శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో తీర్మానాల కమిటీ.గువ్వల బాలరాజు, బాల్క సుమన్, భానుప్రసాద్ ఆధ్వర్యంలో మీడియా కమిటీ ఏర్పాటు. హైదరాబాద్ నగరంలో అలంకరణ మంత్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో జరుగుతుంది. పోలీస్, జీహెచ్ఎంసీ సమన్వయంతో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చేస్తాం’’ అని కేటీఆర్ మీడియాకు తెలిపారు.

Updated Date - 2022-04-18T22:48:13+05:30 IST