8 తాత్కాలిక రైతుబజార్లు ఏర్పాటు

ABN , First Publish Date - 2021-05-06T04:20:41+05:30 IST

కొవిడ్‌ మార్గదర్శకాలు అనుసరించి ఎనిమిదో జోన్‌ పరిధి ఎనిమిది వార్డులలో ఎనిమిది తాత్కాలిక రైతుబజార్లు ఏర్పాటుచేశామని జడ్సీ చక్రవర్తి తెలిపారు. పెందుర్తిలో రైతుబజార్‌ ఏర్పాట్లను బుధవారం ఆయన పర్యవేక్షించారు. తాత్కాలిక రైతుబజార్ల వద్ద భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకున్నామన్నారు.

8 తాత్కాలిక రైతుబజార్లు ఏర్పాటు
పెందుర్తి కళాశాలలో రైతుబజార్‌ ఏర్పాట్లను పరిశీలిస్తున్న జడ్సీ చక్రవర్తి

పెందుర్తి, మే 5: కొవిడ్‌ మార్గదర్శకాలు అనుసరించి ఎనిమిదో జోన్‌ పరిధి ఎనిమిది వార్డులలో ఎనిమిది తాత్కాలిక రైతుబజార్లు ఏర్పాటుచేశామని జడ్సీ చక్రవర్తి తెలిపారు. పెందుర్తిలో రైతుబజార్‌ ఏర్పాట్లను బుధవారం ఆయన పర్యవేక్షించారు. తాత్కాలిక రైతుబజార్ల వద్ద భౌతికదూరం  పాటించేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఈ క్రమంలో 96వ వార్డు పెందుర్త్తి కళాశాల మైదానం, 97వ వార్డు  చినముషిడివాడ ఐయాన్‌ డిజిటల్‌ కేంద్రం,  89 వార్డు చంద్రానగర్‌ రైల్వేగేట్‌ సమీపం, 90 వార్డు విమాన్‌నగర్‌ సామాజిక భవనం, 91 వార్డు బాజీజంక్షన్‌, 92 వార్డు గోపాలపట్నం ఉన్నత పాఠశాల మైదానం, 93వ వార్టు సాయిమాధవనగర్‌, 94వ వార్డు వేపగుంట ఉన్నత పాఠశాలల్లో తాత్కాలిక రైతుబజార్లు ఏర్పాటుచేశామని జడ్సీ వివరించారు. ఆయన వెంట తహసీల్దార్‌ పైల రామారావు ఉన్నారు.

Updated Date - 2021-05-06T04:20:41+05:30 IST