రాచకొండలో 3వీ సేఫ్‌ టన్నెల్‌ ఏర్పాటు...

ABN , First Publish Date - 2020-04-09T16:06:06+05:30 IST

రాచకొండలో 3వీ సేఫ్‌ టన్నెల్‌ ఏర్పాటు...

రాచకొండలో 3వీ సేఫ్‌ టన్నెల్‌ ఏర్పాటు...

 త్వరలో అన్ని పోలీస్‌స్టేషన్‌లలో అందుబాటులోకి

హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): నగరంలో కరోనా రోజు రోజుకూ విజృంభిస్తున్న నేపథ్యంలో రాచకొండ కమిషనరేట్‌లో రక్షణ చర్యలకు శ్రీకారం చుట్టారు సీపీ మహేష్‌ భగవత్‌. ఎంట్రన్స్‌లో 3వీ సేఫ్‌ టన్నెల్‌ను ఏర్పాటు చేయించారు. కమిషనరేట్‌ లోపలికి వచ్చేవారంతా ఆ టన్నెల్‌లో 20 సెకన్లు ఉండి రావాలి. అప్పుడు ఆటోమైజ్‌డ్‌ లిక్విడ్‌ స్ర్పే అందులో ఉన్న వ్యక్తిపై పడుతుంది. దాంతో అతను పూర్తి శానిటైజ్‌ (డిస్‌ఇన్‌ఫెక్టు) చేయబడి బయటకు వస్తాడు. ఇలా కొవిడ్‌-19 వైరస్‌ బారినపడకుండా 3వీ టన్నెల్‌ రక్షణగా ఉపయోగపడుతుంది. దీన్ని ఎస్‌3వీ వ్యాస్క్యులర్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వారు తయారు చేశారు. చిన్న పరిమాణంలో మరికొన్ని టన్నెల్స్‌ను తయారు చేయించి త్వరలోనే కమిషనరేట్‌ పరిధిలోని అన్ని పోలీస్‌స్టేషన్‌లలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అందుకు వారు అంగీకరించినట్లు చెప్పారు. టన్నెల్‌ను రాచకొండ కుమిషనరేట్‌కు బహూకరించిన మాగంటి ప్రదీ్‌పకుమార్‌కు, దాన్ని డిజైన్ చేసిన భద్రినారాయణ,డాక్టర్ విజయ్ టీమ్‌ను సీపీ అభినందించారు.

Updated Date - 2020-04-09T16:06:06+05:30 IST