జిల్లాలో 361 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

ABN , First Publish Date - 2021-04-17T06:41:31+05:30 IST

జిల్లాలో 361 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు మార్కెటింగ్‌ జిల్లా అధికారి శ్రీకాంత్‌ తెలిపారు.

జిల్లాలో 361 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
చింతపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తున్న మార్కెటింగ్‌ జిల్లా అధికారి శ్రీకాంత్‌

మార్కెటింగ్‌ జిల్లా అధికారి శ్రీకాంత్‌
చింతపల్లి, ఏప్రిల్‌ 16 :
జిల్లాలో 361 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు మార్కెటింగ్‌ జిల్లా అధికారి శ్రీకాంత్‌ తెలిపారు. శుక్రవారం ఆయన మండల కేంద్రంలోని వ్యవసాయ సబ్‌ మార్కెట్‌ కమి టీ కార్యాలయంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకు రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పె ట్టుకొని 361ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయి ంచగా ఇప్పటికే 265కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కేంద్రాలతో  రైతుల నుంచి 2,68,240 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. రైతులు తమ ధాన్యం తాలుతో పాటు తేమ లేకుండా తేవాలన్నారు. క్వింటాకు రూ.1888 మద్దతు ధర ఇస్తున్నట్లు తెలిపారు. రైతులు దళారులను నమ్మకుండా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించాలన్నారు. ఆయన వెంట వీటీనగర్‌ మార్కెట్‌ శాఖాధికారి శ్రీనివాస్‌, సిబ్బంది ఉన్నారు.  
రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు : చింతరెడ్డి
మిర్యాలగూడ :
వ్యవసాయ మార్కెట్‌ యార్డుతో పాటు మండల వ్యాప్త ంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ధాన్యం కొనగోళ్లు రికార్డు స్థాయిలో సాగుతున్నాయని ఏఎంసీ చైర్మన్‌ చింతరెడ్డి శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ధాన్యం కొనుగోళ్ల వివరాలను వెల్లడించారు. 50 ఐకేపీ, 37 పీఏసీఎస్‌, వ్యవసాయ మార్కెట్‌ కేంద్రంతో కలిపి 88సెంటర్లలో ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు. రైతులకు ఇబ్బంది కలగకుండా 10ఎలకా్ట్రనిక్‌ కాంటాలు, నాలుగు మాయిశ్చర్‌ మిషన్లతో పాటు 1500 టార్పాలిన్లు అందుబాటులో ఉంచామన్నారు. నియోజకవర్గ నలుమూలలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న ధాన్యం ఎప్పటికప్పుడు కొనుగోలు చేస్తు న్నామన్నారు. ఇప్పటికే 46వేల బస్తాలు కొనుగోలు చేశామన్నారు. ప్రభు త్వ సూచన మేరకు చింట్లు రూ.2000లకు పైగా హెచ్‌ఎంటీ రకాలను రూ.1900లకు పైగా ధర పలికేలా చర్యలు తీసుకున్నామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అసత్య ప్రచారాలు, తప్పుడు ఆరోపణలతో రైతులను అయోమయానికి గురి చేస్తున్నారని విమర్శించారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. సమావేశంలో పీఏసీఎస్‌ చైర్మన్లు, సభ్యులు బంటు శ్రీనివాస్‌, వెంకట్‌రెడ్డి, సంజీవరెడ్డి, సైదులు, జగదీష్‌, ఆదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
కొండమల్లేపల్లి :
మండల పరిధిలోని చింతకుంట్ల, పెండ్లిపాకల గ్రామపంచాయతీలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సహకార సంఘం అసిస్టెంట్‌ రిజిస్ర్టార్‌ రామనర్సయ్య, సహకార సంఘం చైర్మన్‌ దూదిపాల వేణుధర్‌రెడ్డితో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సహకార సంఘం చైర్మన్‌ దూదిపాల వేణుధర్‌రెడ్డి మాట్లాడుతూ రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రానికి నాణ్యమైన ధాన్యం తెచ్చి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర పొందాలని సూచించారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మేకల శ్రీనివా్‌సయాదవ్‌, మత్స్యకార సహకార సంఘం మాజీ చైర్మన్‌ శంకర్‌నాయక్‌, సహకార సంఘం డైరెక్టర్లు నాయిని ప్రభాకర్‌రెడ్డి, గ్యార శ్రీనివాస్‌, యాదగిరిరెడ్డి, అమర్‌సింగ్‌, శంకర్‌, సీఈవో తిరుపతిరెడ్డి, పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-17T06:41:31+05:30 IST