కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయండి

ABN , First Publish Date - 2021-02-27T05:37:28+05:30 IST

మునిసిపాలిటీలలో కంట్రోల్‌ రూం/హెల్ప్‌ లైన్‌ను తక్షణమే ఏర్పాటు చేయాలని మున్సిపల్‌ కమిషనర్లను కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అఽథారిటీ జి.వీరపాండియన్‌ ఆదేశించారు.

కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయండి

  1. మున్సిపల్‌ కమిషనర్లను ఆదేశించిన కలెక్టర్‌


కర్నూలు(కలెక్టరేట్‌), ఫిబ్రవరి 26: మునిసిపాలిటీలలో కంట్రోల్‌ రూం/హెల్ప్‌ లైన్‌ను తక్షణమే ఏర్పాటు చేయాలని మున్సిపల్‌ కమిషనర్లను కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అఽథారిటీ జి.వీరపాండియన్‌ ఆదేశించారు. మున్సిపల్‌ ఎన్నికలపై ఎస్పీ. జేసీలు, మున్సిపల్‌ కమిషనర్లు, జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ కలెక్టరేట్‌లో మున్సిపల్‌ ఎన్నికల జిల్లా స్థాయి కంట్రోల్‌ రూం/హెల్ప్‌లైన్‌ను డీఆర్‌డీఏ పీడీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికలు జరిగే అన్ని మున్సిపాలిటీలలో మోడల్‌ కోడ్‌ అమలును అమలు చేయాలన్నారు. ఈ నెల 27న తిరుపతిలో మున్సిపల్‌ ఎన్నికలపై రాయలసీమ జిల్లాల కలెక్టర్లు/జిల్లా ఎన్నికల అథారిటీలు, మునిసిపల్‌ కమిషనర్లతో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ సమీక్ష నిర్వహిస్తున్నట్లు ఆదేశాలు అందాయని, ఎన్నికల ఏర్పాట్ల వివరాలతో నివేదికలను సిద్ధం చేసుకుని సమావేశానికి హాజరు కావాలని ఆదేశించారు. శనివారం సున యన ఆడిటోరియం నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా గుర్తింపు పొందిన/ రిజిస్టర్డ్‌ రాజకీ య పార్టీల ప్రతినిధులు ఎస్‌ఈసీతో మాట్లాడడానికి వీలుగా ఏర్పాట్లు చేయాలన్నారు. ఇందుకు సంబంధించి సమాచారం వారికి ముందే తెలియజేయాలన్నారు. జేసీ రాం సుందర్‌రెడ్డి, కర్నూలు మున్సిపల్‌ కమిషనర్లు డీకే బాలాజీ, నంద్యాల సబ్‌ కలెక్టర్‌ కల్పనా కుమారి, డీఆర్వో పుల్లయ్య, మున్సిపల్‌ కమిషనర్లు, జిల్లా నోడల్‌ అధికారులు పాల్గొన్నారు. 


నియమావళిని అతిక్రమిస్తే సమాచారం ఇవ్వండి

జిల్లాలోని 9 మున్సిపాలిటీలు, కర్నూలు కార్పొరేషన్‌కు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల నియమావళి ఉల్లంఘించినా, ఇతర సమస్యలు ఉన్నా ఎన్నికల కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం అందించవచ్చని కలెక్టర్‌ తెలిపారు. రాతపూర్వకంగా అయితే మున్సిపల్స్‌ ఎలక్షన్స్‌-2021, కర్నూలు జిల్లా, కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ అడ్రస్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. అలాగే వాట్సాప్‌ నెంబర్‌ 8897870074 నెంబర్‌కు విజువల్స్‌, సమాచారం పంపాలని కోరారు. టోల్‌ ఫ్రీ నెంబర్‌ 18004255180, జుుఽజూఠజూఛ్ఛజ్ఛూఛ్టిజీౌుఽట2021 ఃజఝ్చజీజూ.ఛిౌఝ కూడా అందుబాటులో ఉంటాయన్నారు. సమస్యలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.  


Updated Date - 2021-02-27T05:37:28+05:30 IST