ఎసెన్షియల్‌ ఆయిల్స్‌!

ABN , First Publish Date - 2020-02-07T18:33:11+05:30 IST

సౌందర్య చికిత్సలో ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ది ప్రధాన పాత్ర! కాబట్టే చర్మ సంరక్షణ చికిత్సల్లో ఈ నూనెలను విరివిగా వాడుతూ ఉంటారు.

ఎసెన్షియల్‌ ఆయిల్స్‌!

సౌందర్య చికిత్సలో ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ది ప్రధాన పాత్ర! కాబట్టే చర్మ సంరక్షణ చికిత్సల్లో ఈ నూనెలను విరివిగా వాడుతూ ఉంటారు. ప్రధానంగా కొన్ని నూనెల్లో చర్మ సమస్యలను సరిదిద్దే గుణాలు ఉంటాయి.


నిమ్మ నూనె (లెమన్‌ ఆయిల్‌): నిమ్మనూనె వ్యాధికారక క్రిములను తరిమికొట్టగలదు. తాజాదనం, పరిశుభ్రతకు నిమ్మ నూనె వాసనే చిరునామా. కాబట్టే ఇల్లు శుభ్రపరిచే సాధనాలు, సబ్బుల తయారీలో ఈ నూనెను విరివిగా వాడుతూ ఉంటారు. నిమ్మ నూనెలో ‘డి-లిమోనిని’ అనే మూలకం ఉంటుంది. ఇది చర్మం మీది ముడతలు తొలగించి, రక్తప్రసరణను మెరుగుపరిచి, చర్మాన్ని తేటగా మారుస్తుంది.


లావెండర్‌: ఈ నూనె ఎంతో సున్నితమైనది. చర్మం మీద మచ్చలను తొలగించి చర్మం వెలిగిపోయేలా చేస్తుంది. చర్మం మీద మంటలు, సూర్యరశ్మి ప్రభావంతో చర్మం కమిలిపోవడం లాంటి సమస్యలకూ ఈ నూనె విరుగుడుగా పని చేస్తుంది.


క్లేరీ సేజ్‌: వంకాయ రంగు పువ్వులుండే ఒక రకం తులసి మొక్క ఇది. బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పోరాడే గుణం దీనికి ఉంది. పలు రకాల ఇతర వ్యాధికారక క్రిములతో కూడా పోరాడగలదు. చర్మ సమస్యలను తొలగించి, చర్మపు పైపొరలకు రక్తప్రసరణను పెంచే సామర్ధ్యం దీనికి ఉంటుంది.

Updated Date - 2020-02-07T18:33:11+05:30 IST