ఆన్‌లైన్‌లో నిత్యావసరాలు- ప్రత్యేక యాప్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2020-04-10T23:47:18+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపద్యంలో ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ అమలులో భాగమే ఇంటింటికి నిత్యావసర సరుకులు, కూరగాయల రవాణా అని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు.

ఆన్‌లైన్‌లో నిత్యావసరాలు- ప్రత్యేక యాప్‌ ప్రారంభం

నల్గొండ: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపద్యంలో ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ అమలులో భాగమే ఇంటింటికి నిత్యావసర సరుకులు, కూరగాయల రవాణా అని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. ఇంటి నుంచి ప్రజలెవరూ బయటకు రాకుండా ఉంటే వైరస్‌ లింక్‌ తెగిపోతుందన్నది నిపుణులు పేర్కొంన్నందునే లాక్‌డౌన్‌ను మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. లాక్‌డౌన్‌ నేపధ్యంలో ఆధునిక పరిజ్ఞానంతో రూపొందించిన యాప్‌ను ప్రారంభించినట్టు తెలిపపారు. ఇంటింటికీ నిత్యావసర సరుకులు,కూరగాయలు అందించేందుకు నల్లగొండ జిల్లా దేవరకొండ పురపాలక సంఘాలలో రూపొందించిన ప్రత్యేక యాప్‌లనుఆయన శుక్రవారం ప్రారంభించారు. 


సూర్యపేటలో ప్రయోగాత్మకంగా రూపొందించి అమలుచేసిన ఈ యాప్‌ విజయవంతం కావడంతో జిల్లా వ్యాప్తంగా అమలులోకి తీసుకు రావాలని మంత్రి జగదీశ్‌రెడ్డి సూచించారు. ప్రజలకు మరింత సౌకర్యవంతంగా నిత్యావసర సరుకులు, కూరగాయలను అందించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని చెప్పారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా మొదలుపెట్టిన ఈ యాప్‌లను ఇప్పుడు జిల్లా మొత్తం విస్తరిస్తున్నట్టు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్‌ ఛైర్మన్‌ బండనరేందర్‌రెడ్డి, నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, దేవర కొండా ఎమ్మెల్యే రవీంద్రనాయక్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా కరోనా వైరస్‌ బారిన పడకుండా ఉండేందుకు స్థానిక పెద్దగడియారం వద్ద ఏర్పాటుచేసిన సోడియా హైపో క్లోరిడ్‌ స్ర్పే టన్నెల్‌ మిషన్‌ను కూడా మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రారంభించారు. 

Updated Date - 2020-04-10T23:47:18+05:30 IST