ఎస్సారెస్పీ ఆరు గేట్ల ద్వారా నీటి విడుదల

ABN , First Publish Date - 2021-09-16T07:02:25+05:30 IST

ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టులోకి 27,890 క్యూసెక్కుల వరదనీరు చేరడంతో ప్రాజెక్టు నుంచి ఆరు గేట్ల ద్వారా 18,720 క్యూసెక్కుల మిగులు జలాలను గోదావరి లోకి విడుదల చేస్తున్నట్టు ప్రాజెక్టు ఎస్‌ఈ శ్రీనివాస్‌ తెలిపారు.

ఎస్సారెస్పీ ఆరు గేట్ల ద్వారా నీటి విడుదల
ప్రాజెక్టు గేట్ల ద్వారా గోదావరిలోకి విడుదలవుతున్న మిగులు జలాలు

ఎగువ నుంచి 27,890 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

మెండోర, సెప్టెంబరు 15: ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టులోకి 27,890 క్యూసెక్కుల వరదనీరు చేరడంతో ప్రాజెక్టు నుంచి ఆరు గేట్ల ద్వారా 18,720 క్యూసెక్కుల మిగులు జలాలను గోదావరి లోకి విడుదల చేస్తున్నట్టు ప్రాజెక్టు ఎస్‌ఈ శ్రీనివాస్‌ తెలిపారు. ఈ సందర్భం గా ప్రాజెక్టు ఎస్కెప్‌ ఐదు గేట్ల ద్వారా ఐదు వేల క్యూసెక్కుల నీటిని గోదావరి లోకి విడుదల చేశారు. కాకతీయ కాలువ ద్వారా 2వేల  క్యూసెక్కులు, లక్ష్మీ కాలువకు 80క్యూసెక్కులు, సరస్వతీ కాలువకు 800క్యూసెక్కుల నీటిని విడు దల చేసినట్టు వివరించారు. ప్రాజెక్టు నుంచి అవిరి రూపంలో 628క్యూసెక్కు లు, మిషన్‌ భగీరథకు 152 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో పోతుందని తెలిపారు. ప్రాజె క్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091అడుగులు (90టీఎంసీ)లు కాగా బుధవారం సాయంత్రానికి 1090.9అడుగులు(89.763టీఎంసీ)ల నీటి నిల్వ ఉంది. గత ఏడాది ఇదేరోజున 1091.0 అడుగులు (90.313 టీఎంసీ) నీటి నిల్వ ఉంది. జూన్‌ 1నుంచి ప్రాజెక్టు 298టీఎంసీల నీరు వచ్చి చేరిందని 227 టీఎంసీల మిగులు జలాలను గోదావరిలోకి విడుదల చేశామని తెలిపారు.

Updated Date - 2021-09-16T07:02:25+05:30 IST