హైదరాబాద్‌లో తొలి క్యాన్సర్‌ రీసెర్చ్‌ కేంద్రం: Esperer

ABN , First Publish Date - 2021-09-16T00:42:16+05:30 IST

హైదరాబాద్‌లో తొలి క్యాన్సర్‌ రీసెర్చ్‌ కేంద్రం: Esperer

హైదరాబాద్‌లో తొలి క్యాన్సర్‌ రీసెర్చ్‌ కేంద్రం: Esperer

హైదరాబాద్‌: దేశంలో తొలి క్యాన్సర్‌ రీసెర్చ్‌ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించినట్లు పరిశోధనాధారిత అంతర్జాతీయ క్లీనికల్‌ న్యూట్రిషన్‌ సంస్థ, ఎస్పెరర్‌ న్యూట్రిషన్‌ (ఈఓఎన్‌) తెలిపింది. వినూత్నమైన న్యూట్రిషనల్‌ చికిత్సలను వినియోగించి అత్యంత క్లిష్టమైన వ్యాధుల నివారణ మరియు నిర్వహణ చేయడంలో అగ్రగామిగా ఎస్సెరర్‌ న్యూట్రిషన్‌ వెలుగొందుతుంది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈ న్యూట్రిషన్‌ పరిశోధనా కేంద్రం నాణ్యమైన క్షేత్రస్ధాయి మరియు ల్యాబ్‌ అధ్యయనాలను అందించడంతో పాటుగా వినియోగదారులకు మెరుగైన ఫలితాలను అందించనుంది. భారతదేశంలో క్యాన్సర్‌ సహా సంక్రమణేతర వ్యాధులు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. ఇవి ప్రధానంగా మనం అనుసరిస్తున్న జీవనశైలి సంబంధితం కావడంతో పాటుగా ఒకరు పొందే చికిత్సతో ఆ వ్యాధిలను నియంత్రించుకోవడం సాధ్యమవుతుంది. ఈ తరహా వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే సమగ్రమైన పౌష్టికాహారం అవసరం ఉంది. ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవడమనేది ఆరోగ్యవంతమైన, చురుకైన శరీరం నిర్మించుకోవడంలోనూ సహాయపడుతుంది. ఈ కారణం చేత ప్రతి ఒక్కరికీ సరైన డైట్‌ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటీవలి కాలంలో  విడుదలైన అంతర్జాతీయ న్యూట్రిషన్‌ నివేదికల ప్రకారం, పౌష్టికాహార లోపం కలిగిన దేశాల సరసన ఇండియా నిలిచింది. 

Updated Date - 2021-09-16T00:42:16+05:30 IST